Akhanda 2 Balakrishna: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) కెరీర్ నే మార్చేసిన చిత్రం ‘అఖండ'(Akhanda Movie). వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో కెరీర్ ముగిసిపోయే రేంజ్ లో ఉన్న బాలయ్య కి ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ సాధారణమైనది కాదు. ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా, బాలయ్య లో ఒక కొత్త ఎనర్జీ ని నింపింది. ఫలితంగా ఈ చిత్రం తర్వాత ఆయన చేసిన వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి చిత్రాలు కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. బాలయ్య లో అలాంటి కొత్త ఎనర్జీ ని నింపిన అఖండ చిత్రానికి సీక్వెల్(Akhanda 2 -Thandavam) తీస్తున్నారంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉండుంటాయో మనం విడుదలకు ముందే ఊహించుకున్నాం. సినిమా పూర్తి అయ్యేలోపు ఊహించిన దానికంటే ఎక్కువ అంచనాలని ఏర్పాటు చేసుకుంది ఈ చిత్రం. అయితే ఈ సినిమా గురించి సోషల్ మీడియా లో లీక్ అయిన ఒక వార్త ఇప్పుడు అభిమానులను కంగారు పెడుతుంది.
Also Read: రాజమౌళి దెబ్బకి మరోసారి టికెట్ రేట్లు పెరగబోతున్నాయా..?
ఈ చిత్రం షూటింగ్ సమయం లో బాలకృష్ణ, బోయపాటి శ్రీను మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ ఏర్పడింది అనే వార్త ఇండస్ట్రీ సర్కిల్స్ లో పెద్ద దుమారమే రేపింది. అనేక సన్నివేశాలు బాలయ్య కి నచ్చలేదు, ఇదేంటి నాకు నువ్వు చెప్పిన సన్నివేశం ఇది కాదు కదా అని బోయపాటి శ్రీను ని బాలయ్య ప్రశ్నించడం, దానికి బోయపాటి వివరణ ఇవ్వడం, ఇలా చాలా సన్నివేశాలకే జరిగాయట. జార్జియా షెడ్యూల్ లో ఇద్దరి మధ్య విబేధాలు తారా స్థాయికి చేరాయనే వార్త కూడా బాగా ప్రచారం అయ్యింది. లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే బాలయ్య రీసెంట్ గానే సెకండ్ హాఫ్ కి సంబంధించి కొన్ని రషస్ ని చూశాడట. అవి ఆయనకు అంతగా నచ్చలేదని తెలుస్తుంది. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం.
‘అఖండ’ లో ప్రతీ యాక్షన్ సన్నివేశానికి ఒక కారణం ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది, అందుకే అవి వెండితెర మీద బాగా పండాయి, ఆడియన్స్ అద్భుతంగా కనెక్ట్ అయ్యారు, కానీ ‘అఖండ 2’ లో ఆ కనెక్షన్ మిస్ అయ్యిందనే టాక్ నడుస్తుంది. మళ్ళీ జార్జియా కి వెళ్లి ఆ సన్నివేశాలను ఇప్పుడు రీ షూట్ చేయడం అసాధ్యం కాబట్టి, ఉన్నది ఉన్నట్టుగానే విడుదల చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు. ముందుగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25 న దసరా కానుకగా విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ అప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అవ్వడం అసాధ్యం, అందుకే అక్టోబర్ లో, లేదా డిసెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఇది ఎంత వరకు నిజమో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.