Lokesh Kanagaraj Coolie: డైరెక్టర్లు సాధ్యమైనంత వరకు తమ విజన్ కి తగ్గట్టే సినిమాలను తియ్యాలని అనుకుంటారు. కానీ మధ్యలో హీరోలు తమ ఇమేజ్ కి తగ్గ మార్పులు చెయ్యమని కోరడం దగ్గర నుండే అసలు సమస్యలు మొదలు అవుతాయి. రీసెంట్ గా విడుదలైన సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) ‘కూలీ'(Coolie Movie) చిత్రం అందుకు ఒక ఉదాహరణగా నిల్చింది. వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టేంత సత్తా ఉన్న సినిమా ఇది. అయితే ఈ చిత్రాన్ని డైరెక్టర్ లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) తాను రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం తెరకెక్కించి ఉండుంటే కచ్చితంగా వెయ్యి కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టి ఉండేది. ముందుగా ఆయన ఈ సినిమాని ఎలా తియ్యాలని అనుకున్నాడంటే, రజినీకాంత్ ని సెంటర్ లో పెట్టి ఒక ఫక్తు థ్రిల్లర్ జానర్ సినిమాని తెరకెక్కించాలని అనుకున్నాడు. స్క్రిప్ట్ మొత్తం అందుకు అనుగుణంగా రాసుకున్నాడు.
Also Read: రాజమౌళి దెబ్బకి మరోసారి టికెట్ రేట్లు పెరగబోతున్నాయా..?
స్క్రిప్ట్ ఫైనల్ న్యారేషన్ ని రజినీకాంత్ విన్న తర్వాత, అంతా బాగానే ఉంది కానీ, ఈ చిత్రం లో ప్రతీ భాష నుండి ఒక పేరున్న హీరో ని తీసుకుంటే సినిమాకు మరింత క్రేజ్ పెరుగుతుంది, ఒకసారి ఆలోచించు అని అన్నాడట. దీంతో లోకేష్ తెలుగు నుండి నాగార్జున(Akkineni Nagarjuna) ని తీసుకున్నాడు, కన్నడ నుండి ఉపేంద్ర(Upendra) ని తీసుకున్నాడు, హిందీ నుండి ఏకంగా అమీర్ ఖాన్(Aamir Khan) ని కూడా తీసుకొచ్చాడు. ఇక మలయాళం నటుడు సౌబిన్ సాహిర్ ని స్క్రిప్ట్ ప్రారంభం దశలోనే లోకేష్ తీసుకున్నాడు అనుకోండి అది వేరే విషయం, ఆయన క్యారక్టర్ వల్లే ఫ్లాప్ అవ్వాల్సిన ఈ సినిమా యావరేజ్ రేంజ్ కి అయినా స్థిరపడింది అనుకోవచ్చు. అయితే ఇలా ఇతర భాషల నుండి స్టార్స్ ని ఎంచుకోవడం వల్ల, స్క్రిప్ట్ లో వాళ్ళ క్యారెక్టర్స్ ని మధ్యలో సరైన పద్దతిలో ఇరికించడం లో డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ విఫలం అయ్యాడు.
ఫస్ట్ హాఫ్ లో విలన్ గా నటించిన నాగార్జున సైమన్ క్యారక్టర్ ని వేరే లెవెల్ లో చూపించాడు, కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం ఆయన క్యారక్టర్ బాగా డౌన్ అయిపోతుంది. ఒక సరైన ఆర్క్ ని క్రియేట్ చేయలేకపోయాడు. అదే విధంగా ఉపేంద్ర క్యారక్టర్ ని ఎదో కావాలని స్పెషల్ గా ఫ్యాన్స్ కోసం తీసుకొచ్చినట్టే ఉంది కానీ, ఆయన క్యారక్టర్ కి కూడా ఎలాంటి ఆర్క్ లేదు. ఇక అమీర్ ఖాన్ ని అయితే ఒక కమెడియన్ లాగానే చూపించాడు క్లైమాక్స్ లో. ఇలా స్టార్స్ ని సరిగా ఉపయోగించుకోలేకపోవడం, వాళ్లకు క్యారెక్టర్స్ క్రియేట్ చేయడం లో విఫలం అవ్వడమే చూసే ఆడియన్స్ కి తీవ్రమైన నిరాశని కలిగించింది. ఒకవేళ లోకేష్ కనకరాజ్ తాను అనుకున్న విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించి ఉండుంటే, కచ్చితంగా ఈ చిత్రం మరోలా ఉండేది అనుకోవచ్చు. ఓవరాల్ గా ఈ సినిమా అనుకున్న టార్గెట్ ని చేరుకోలేకపోవడానికి కారణం రజినీకాంత్ అనే చెప్పాలి.