
ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 5న పాఠశాలలు పున:ప్రారంభమవుతాయని భావించినప్పటికీ వాయిదా వేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నవంబర్ 2న స్కూళ్లు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అయితే పిల్లలకు ‘జగనన్న విద్యాకానుక’ కిట్‌ను అక్టోబర్ 5న అందజేస్తామని తెలిపారు.