Balayya Akhanda: తెలుగు సినీ కళామతల్లి భయంతో బిక్కుబిక్కుమంటూ ఆశగా ఎదురుచూస్తుంది. బాక్సాఫీస్ వద్ద తనకు ఏ బిడ్డ విముక్తి కలిగిస్తాడో అని ఆ తల్లి ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే, ఆ తల్లి పురుటి నొప్పుల బాధను తీర్చే బాధ్యతను అఖండ తలకెత్తుకున్నాడు. అసలుకే బాలయ్య సినిమాలకు ఓపెనింగ్స్ ఉండవని ఒక రూమర్ ఉంది. అది బాలయ్య జనంలోకి రాకముందు. కానీ, ఇప్పుడు పరిస్థితిలు మారాయి. బాలయ్య అంటే అందరిలో గౌరవం పెరిగింది.

బాలయ్యలో ఉండేది బలుపు కాదు, ఓపెన్ నెస్ అని అందరికీ అర్ధం అయింది. అందుకే, ఇప్పుడు బాలయ్య సినిమా కోసం ప్రేక్షుకులతో పాటు ప్రముఖులు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పైగా గత మూడు వారాలుగా సరైన సినిమాలేక తెలుగు సినిమా బాక్సాఫీసు నీరసించిపోయింది. మరి డీలా పడిన తెలుగు సినిమాకు ఊపు తేవాలి అంటే.. మాస్ సినిమా పడాలి.
మాస్ సినిమా అంటేనే బాలయ్య. కాబట్టి.. ఈ వారంతో సినిమా కలెక్షన్స్ లోటు తీరిపోతుంది. ‘అఖండ’తో ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహాన్ని బాలయ్య- బోయపాటి కలయిక తీసుకు వస్తోందేనే నమ్మకం
ఉంది. పైగా గతంలో వీరిద్దరు చేసిన సింహా, లెజెండ్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అందుకే అఖండ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
Also Read: Rashi Khanna: రాశీ ఖన్నా కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన “పక్కా కమర్షియల్” మూవీ టీమ్…
దానికి తోడు అఖండ టీజర్స్, అండ్ ట్రైలర్స్ ఓ రేంజ్ లో హిట్ అయ్యాయి. అన్నిటికీ మించి బాలకృష్ణ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నాడు. మొదటిసారి అఘోరగా నటిస్తున్నాడు. అందుకే ఈ సినిమాకి బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ‘మరి ఆ బిజినెస్ కి తగ్గట్టు కలెక్షన్స్ వస్తే.. ఆ తర్వాత వచ్చే పెద్ద సినిమాలకు ఊపు వస్తోంది.
అప్పుడు, తెలుగు సినిమా మళ్ళీ ఫామ్ లోకి వస్తోంది. అలా రావాలి అంటే.. బాలయ్య బాబు తన ‘అఖండ’తో అఖండమైన విజయం సాధించాలి.
Also Read: NTR: చనిపోయే గంట ముందు ఎన్టీఆర్ ఏం చేశాడో తెలుసా?