NTR: ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు.. చాలామంది రాజకీయ నాయకులు చాలా రకాల విమర్శలు చేశారు. అందులో ముఖ్యమైనది.. ‘రాజకీయం అంటే ముఖానికి రంగు వేసుకోవడం కాదు’. దానికి ఎన్టీఆర్ సమాధానమిస్తూ ‘నిజమే… అందుకే, నేను రాజకీయాల్లో రంగులు వేసుకోను’ అన్నారు నవ్వుతూ. ఆ మాట ప్రకారమే తనకు రాజకీయ రంగు అంటకుండా నిక్కచ్చిగా ఖచ్చితత్వంతో ఎన్టీఆర్ రాజకీయాలు చేశారు. ఆ ముక్కుసూటి తనమే ఆయనకు శాపం అయింది.

Sr NTR
రాబందులు లాంటి రాజకీయ పక్షులు సమయం కోసం నక్క చూపులు చూశాయి. అలాంటి సమయంలోనే ఓ విశ్వాసం లేని కుక్క సింహాన్ని మోసగించి దారుణం చేసింది. దాని ఫలితంగా సింహం లాంటి ఎన్టీఆర్ మానసికంగా చితికిపోయారు. కన్నవారే దూరం జరిగి పగవారిలా ప్రవర్తించిన తీరు ఎన్టీఆర్ గారిని తీవ్రంగా వేధించింది.
అన్నిటికీ మించి ఓ అనామకుడికి అడ్రెస్ కల్పించి గుర్తింపు ఇస్తే.. ఆ గుర్తింపు తాలూకు గుర్తులనే ఆ అనామకుడు చెరిపేస్తాడా ? అని ఎన్టీఆర్ గారి అహం ఆక్రోశిచింది. కుళ్ళు కంపు కొడుతున్న నీచమైన రాజకీయాలలో కూడా నిజాయితీ గల రాజకీయ నాయకుడు అని తాను సంపాదించిన పేరు ప్రఖ్యాతలు కూడా చివరకు తనకు అక్కరకు రాలేదు అని ఎన్టీఆర్ గారి మనసు క్షోభ పడింది.
ఆ బాధతోనే ఆ ఆవేదనతోనే ఎన్టీఆర్ అకాల మరణం చెందారు. ఆయన మరణం ఇప్పటికీ ఎప్పటికీ అభిమానులను కలిచివేస్తూనే ఉంటుంది. ఎందుకంటే.. ఎన్టీఆర్ గారిది సహజ మరణం కాదు, చాటుమాటు కుట్రలన్నీ ఏకం అయి చేసిన మానసిక హత్య అది. అయితే ఎన్టీఆర్ గారు చనిపోయే ఒక గంట ముందు ఎంతో మనో వేదనకు గురయ్యారట.
Also Read: Parugu Heroine Sheela Kaur: ‘పరుగు’ హీరోయిన్ ఇప్పుడే పరిస్థితుల్లో ఉందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
ఇటు రాజకీయాల్లోనూ, అటు సినిమా రంగంలోనూ ఎదురులేని నాయకుడిగా ఎదిగిన తాను, ఓ నీచుడు చేతిలో మోసపోవడం ఏమిటి ? అని కన్నీళ్లు పెట్టుకున్నారట. ఆ విషయాన్నే తనలో తాను పదే పదే అనుకుంటూ ఎంతో మనో వేదనతో కుమిలిపోతూ ఎన్టీఆర్ గారు తుదిశ్వాస విడిచారు. ఆ క్షణం తెలుగు తల్లి మనసు కూడా తీవ్రంగా క్షోభించి ఉంటుంది.
ఏది ఏమైనా ఎన్టీఆర్ గారిని ఇప్పటికీ తెలుగు ప్రజలు అభిమానిస్తున్నారు అంటే దానికి కారణం.. ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ గారు ప్రవేశ పెట్టిన ఎన్నో గొప్ప పథకాలే. ప్రజలకు ఆయన చేసిన మంచే. అందుకే… ఎన్టీఆర్ తెలుగు పదం ఉన్నంత వరకు శాశ్వతంగా ఉంటారు.
Also Read: 83 Trailer Talk: ట్రైలర్ టాక్ : కపిల్ దళం చేసిన అద్భుత సమ్మేళనమే ’83’ !