https://oktelugu.com/

Balakrishna- Pawan Kalyan: బాలయ్య – పవన్ సరికొత్త రికార్డ్స్ సృష్టించడం ఖాయం.. ఓటీటీ లోనే ఇది ఓ చరిత్ర !

Balakrishna- Pawan Kalyan: బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో సూపర్ సక్సెస్. హోస్ట్ గా మారాలనుకుంటున్న, ఆల్రెడీ మారిన స్టార్స్ కి ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు బాలయ్య. ఇద్దరు సెలబ్రిటీల మధ్య ఇంటర్వ్యూలలో జరిగే సంభాషణంతా డిప్లోమాటిక్ సాగుతుంది. ప్రశ్నల నుండి ఆన్సర్స్ వరకు అంతా పాలిష్డ్ గా ఉంటాయి. మరి ఇలాంటి టాక్ షోలతో కిక్కేముంటుంది. రా మెటీరియల్ బయటకు తీసి, నిజాలు జనాల ముందు మాట్లాడుకుంటే ఆ మజానే వేరు. […]

Written By:
  • Shiva
  • , Updated On : September 19, 2022 / 09:57 AM IST
    Follow us on

    Balakrishna- Pawan Kalyan: బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో సూపర్ సక్సెస్. హోస్ట్ గా మారాలనుకుంటున్న, ఆల్రెడీ మారిన స్టార్స్ కి ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు బాలయ్య. ఇద్దరు సెలబ్రిటీల మధ్య ఇంటర్వ్యూలలో జరిగే సంభాషణంతా డిప్లోమాటిక్ సాగుతుంది. ప్రశ్నల నుండి ఆన్సర్స్ వరకు అంతా పాలిష్డ్ గా ఉంటాయి. మరి ఇలాంటి టాక్ షోలతో కిక్కేముంటుంది. రా మెటీరియల్ బయటకు తీసి, నిజాలు జనాల ముందు మాట్లాడుకుంటే ఆ మజానే వేరు. ఆ ట్రెండ్ కి బాలయ్య నాంది పలికారు.

    Balakrishna

    తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో ప్రసారమైన అన్ స్టాపబుల్ టాక్ షో, టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ టాప్ గెస్ట్స్ తో బాలయ్య సరదా సంభాషణలు, ఏళ్లుగా ప్రచారమవుతున్న వివాదాలకు సమాధానాలు ఫస్ట్ సీజన్ లో ఆసక్తి కలిగించాయి. తాజాగా బాలయ్య ‘అన్‌స్టాబుల్‌ విత్‌ ఎన్‌బీకే’ సీజన్‌-2పై సాలిడ్‌ అప్‌డేట్‌ వచ్చింది. ‘అన్ స్టాపబుల్’ 2 షో ఫస్ట్ ఎపిసోడ్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు.

    Also Read: Samantha: అమెరికాలో సమంత కి స్కిన్ ట్రీట్మెంట్.. షాక్ లో ఫ్యాన్స్.. అసలు సమంతకు ఏమైంది ?

    పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ కూడా వెళ్తాడట. పవన్ – బాలయ్య ఒకే వేదిక పై, పైగా ఇద్దరి మధ్య పర్సనల్ విషయాలు డిస్కషన్ కి రావడం నిజంగా కొత్త విషయమే. మధ్యలో త్రివిక్రమ్.. బాలయ్య త్రివిక్రమ్ పై పంచ్ లు వేసేలా ఎపిసోడ్ ను డిజైన్ చేశారట. ఏ రకంగా చూసుకున్నా బాలయ్య – పవన్ ఎపిసోడ్ సరికొత్త రికార్డ్స్ ను సృష్టించడం ఖాయం అంటున్నారు. కానీ బాలయ్య – పవన్ ల మధ్య రాజకీయ వార్ కూడా ఉంది.

    Balakrishna, Pawan Kalyan

    ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు రాజకీయాల గురించి కూడా మాట్లాడుకుంటారా ?, ఒకవేళ మాట్లాడుకుంటే.. ఏం మాట్లాడుకుంటారు ?, ఎవరి గురించి ఎవరు ఎలాంటి కామెంట్స్ చేస్తారు అనే విషయాలే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఏది ఏమైనా ఎప్పుడూ గంభీరంగా ఉండే బాలయ్య హోస్ట్ గా చేయడం, పైగా ఆ షో సూపర్ హిట్ అవ్వడం.. మొత్తమ్మీద బాలయ్య అంటే ఏమిటో అందరికీ అర్థం అయింది.

    మొత్తమ్మీద బాలయ్య హోస్ట్ గా బాగా సక్సెస్ అయ్యారు. ఫీల్డ్ ఏదైనా బాలయ్య అడుగుపెడితే అక్కడ రికార్డులు గల్లంతే అనే నినాదం జనంలోకి బాగా వెళ్ళింది. ఎలాగూ అఖండతో విమర్శకుల నోళ్లకు తాళం వేశాడు బాలయ్య. బాలయ్య టాక్ షో కారణంగానే ఆహాకు చందాదారులు విపరీతంగా పెరిగినట్లు, స్వయంగా నిర్వాహకులు పబ్లిక్ గా చెప్పడం విశేషం. ఇప్పుడు పవన్ ఎపిసోడ్ తో ఇంకా పెరగనున్నారు.

    Also Read: Bigg Boss Telugu 6 Eliminations: బిగ్ బాస్ హౌస్ లో కన్నింగ్ అతడే.. ఈ వారం అభినయశ్రీ ఔట్.. లాస్ట్ లో షాకిచ్చిన నాగార్జున

    Tags