Heroine Jaya Kumari: అలనాటి అభినయానికి ఆమె నేటి నిర్వచనం. అలనాటి స్వర్ణ యుగానికి ఆమె నేటి ఆనవాలు. కానీ, కష్టాలు చుట్టుముట్టాయి. జీవితం కన్నీళ్ళ మయం అయిపోయింది. 400కి పైగా చిత్రాల్లో నటించింది, దక్షిణాదిన ప్రముఖ నటిగా గుర్తింపు తెచ్చుకుంది ?, ఆమె ఒకప్పటి హీరోయిన్ జయకుమారి. రెండు కిడ్నీలు పాడై, చికిత్సకు డబ్బుల్లేక ప్రభుత్వాసుపత్రిలో చేరింది. మహా నటుల సరసన గొప్పగా నటించిన సీనియర్ నటికి ఈ దుస్థితి పట్టడం కచ్చితంగా విషాదకరం. నిజానికి విషాదం జయకుమారి జీవితమంతా నిండిపోయి ఉంది. ఆమె జీవితంలో సినిమాకు మించిన కష్టాలున్నాయి. ఒకట్రెండు కాదు..ఎన్నెన్నో విషాద ఘటనలు. జీవితంలో లైంగిక వేధింపులు, కుటుంబ సమస్యలు, రక్త సంబంధీకులను అర్ధాంతరంగా కోల్పోవడం…ఇలా ఎన్నో బాధలు. ఇప్పుడు ఆరోగ్య సమస్యలు.

జయకుమారి భర్త పేరు నాగపట్టినం అబ్దుల్లా. చాలాకాలం క్రితమే అబ్దుల్లా చనిపోయారు. జయకుమారి – అబ్దుల్లా దంపతులకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కానీ తల్లిని చూసుకునే మనసు వారికీ లేకుండా పోయింది. పైగా ఆమె ఆస్తులు లాగేసుకుని బయటకు నెట్టేశారు పిల్లలు.దాంతో జయకుమారి చెన్నై, వేలచ్చేరిలోని ఓ అద్దె ఇంట్లో ఉంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈమెకు కిడ్నీలు దెబ్బతిన్నాయి. చికిత్స చేసుకునే ఆర్థిక స్థోమత లేక చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రస్తుతం దీనంగా పడి ఉంది.
ఎవరైనా ఆర్థిక సాయం బతుకుతున్నాను అంటూ జయకుమారి కన్నీళ్లు పెట్టుకోవడం చుట్టుపక్కల వ్యక్తుల మనసులను కలిచివేసింది. ఒక మహానటికి ఇంతటి దుస్థితి ఏమిటి అంటూ చలించి పోతున్నారు నెటిజన్లు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించిన జయకుమారి అంటే అప్పట్లో యువకులు పడి చచ్చేవారు. ముఖ్యంగా తమిళంలో ‘ నూట్రుక్కు నూరు’ అనే చిత్రం రిలీజ్ అయ్యాక ఆమె అక్కడ స్టార్ హీరోయిన్ అయ్యింది.

ఆ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదగడం వెనుక జయకుమారి కఠోర శ్రమ, చిత్రపరిశ్రమపై ప్రేమ దాగి ఉన్నాయి. అప్పట్లోనే జీవితంలో ఓ గొప్ప స్ఫూర్తిని రగిల్చే జీవన పోరాటాన్ని ఆవిష్కరించారామె. ‘ప్రజలు ‘మురికివాడ’గా పిలిచే ప్రదేశం నుంచి వచ్చా. ఆమెది దిగువ మధ్య తరగతి కుటుంబం. 8 ఏళ్ల వయసులో కష్టాలంటే ఏంటో జయకుమారికి మొదట తెలిసి వచ్చాయి. అంత చిన్న వయసులో నాన్నను శాశ్వతంగా కోల్పోయింది. అప్పటి నుంచి నాటకాలు వేస్తూ కుటుంబాన్ని పోషిచింది. తన పెద్దలు కోసం తన జీవితాన్నే త్యాగం చేసింది. కానీ పిల్లల చేతిలో దారుణంగా మోసపోయింది. ఎవరైనా దాతులు జయకుమారిని ఆదుకోవాలకుని కోరుకుందాం.
Also Read: Ramanuj Pratap Singh- Cheetahs: ఆ రాజు వేట సరదా.. చిరుతల అంతానికి కారణం
Recommended


[…] […]
[…] […]