https://oktelugu.com/

డైరెక్టర్లకు ‘బాలయ్య’ నుండి మెసేజ్ !

నట సింహం నందమూరి బాలకృష్ణ అంటేనే ఒక తెలియని భయం ఉంటుందని.. ఆయనతో పని చేయడం నిజంగా ఒక ఛాలెంజింగ్ అని…ఎందుకంటే బాలయ్యది చిన్న పిల్లల మనస్తత్వం అని.. ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ చెబుతుంటారు. దానికి తగ్గట్లుగానే బాలయ్య బాబు కూడా ఎప్పటికప్పుడు తన చిన్న పిల్లాడి మనసును బాహాటంగానే చాటుకుంటూ తన ప్రత్యేకతను చూపిస్తుంటాడు. అందుకే అందరికీ బాలయ్య అంటే కాస్త భయమే. ఇదే కావొచ్చు.. చాలమందికి ఆయన్ను […]

Written By:
  • admin
  • , Updated On : November 6, 2020 / 04:36 PM IST
    Follow us on


    నట సింహం నందమూరి బాలకృష్ణ అంటేనే ఒక తెలియని భయం ఉంటుందని.. ఆయనతో పని చేయడం నిజంగా ఒక ఛాలెంజింగ్ అని…ఎందుకంటే బాలయ్యది చిన్న పిల్లల మనస్తత్వం అని.. ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ చెబుతుంటారు. దానికి తగ్గట్లుగానే బాలయ్య బాబు కూడా ఎప్పటికప్పుడు తన చిన్న పిల్లాడి మనసును బాహాటంగానే చాటుకుంటూ తన ప్రత్యేకతను చూపిస్తుంటాడు. అందుకే అందరికీ బాలయ్య అంటే కాస్త భయమే. ఇదే కావొచ్చు.. చాలమందికి ఆయన్ను దూరం చేసింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ఒకటి రెండు హిట్లు ఉన్న డైరెక్టర్లకు బాలయ్య బాబుతో పని చేయాలని ఉన్నా.. ఆయనను మనం తట్టుకోలేములే అనుకుని.. ఆ డైరెక్టర్లు సైలెంట్ గా సైడ్ అయిపోతున్నారు. దాంతో టాలెంట్ ఉన్న డైరెక్టర్లు కూడా బాలయ్యకు దూరం అవుతున్నారు. మొత్తానికి బాలయ్యకి ఇది అర్ధమైనట్లు ఉంది. తాజాగా ఆయన దర్శకులకి కూడా లేటెస్ట్ గా ఒక మెసేజ్ పాస్ చేశాడు. ఇక పై తనతో ఎవరైనా సినిమా చేయాలనుకుంటే.. నేరుగా తనని సంప్రదించొచ్చు అని చెప్పుకొచ్చాడు. కాకపోతే తానూ ఇక చేయబోయే చిత్రాల్లో కొత్తదనం ఖచ్చితంగా ఉండాలని బాలయ్య దర్శకులకు క్లారిటీగా చెప్పాడట.

    Also Read: త్రివిక్రమ్‌పై మిడ్‌ రేంజ్‌ హీరోల కన్ను

    మరి బాలయ్యకు కథ చెప్పాలనుకునే దర్శకులు తమ కథలో కచ్చితంగా కొత్తదనం ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే కథ బాలయ్యకు నచ్చుతుంది. కానీ బాలయ్య ఆర్డర్ ను అందుకునే డైరెక్టర్ లు ఎవరు ఉన్నారన్నదే డౌట్. ఇక ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ‘సింహ, లెజెండ్’ చిత్రాల మాదిరిగా మాస్ అండ్ యాంగ్రీ హీరోగానే కాకుండా ఇంకాస్త కొత్తగా కనిపించాలని బాలయ్య గుండు లుక్ లో కనిపించబోతున్నాడు. మరి బాలయ్య గుండు లుక్ ఎలా ఉంటుందో చూడాలి. బాలయ్య – బోయపాటి సినిమాలు ఈ మధ్య ఒన్లీ యాక్షన్ అన్నట్లు ఉంటున్నాయి.. అలాగే ఈ సినిమా కూడా అలాగే ఉంటుందట.