Balayya Injured in Shooting: టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నాడు. షూటింగ్ సమయంలోనే బాలయ్య కిందపడగా.. వారి కాలికి గాయం అయినట్టు తెలుస్తుంది. విషయానికి వస్తే తెలుగు ఓటీటీ ‘ఆహా’ సంబంధించిన ఒక ప్రోగ్రాంలో బాలయ్య హోస్ట్ గా చేయనున్నట్టు టాక్. తాజాగా దీనికి సంబంధించిన షూటింగ్ చేస్తున్న సమయంలోనే బాలయ్య కాలికి గాయం అయింది. కానీ అది చిన్న గాయమే అని బాలయ్య దానిని లెక్క చేయకుండా షూటింగ్ పూర్తి చేశారని తెలుస్తోంది. కాగా ఈ షూట్ కి సంబంధించిన వివరాలను ‘ఆహ’ యూనిట్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది.

తన సినిమా కోసం ఎలాంటి రిస్కులైన తీసుకునే బాలయ్య అంకితభావం గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన పనిలేదు. ఈ నందమూరి నటసింహం ఏడాదికి మూడు సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు ధీటుగా పోటీలో నిలుస్తున్నారు. బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘అఖండ’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే గతంలో వీరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. హ్యాట్రిక్ కొట్టాలని ఈసారి బోయపాటి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ‘అఖండ’ సినిమాను రూపొందించాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పోస్టర్లు రికార్డులు కొల్లగొట్టాయి. ప్రస్తుతానికి షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యూనిట్ ప్రీ ప్రొడక్షన్లో బిజీగా ఉంది.
అఖండ అనంతరం బాలయ్య బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధం అయినట్టు టాక్. ఈ సినిమాతో పాటు బాలకృష్ణ – యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు. అలాగే 1991 లో సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో విడుదలై మంచి హిట్ సాధించిన ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ సినిమా కూడా చేయబోతున్నారట ఈ నందమూరి సింహం.