Ram- Boyapati Movie: గత ఏడాది నందమూరి బాలకృష్ణ తో బోయపాటి శ్రీను తీసిన అఖండ సినిమా ఏ స్థాయి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంచనాలను మించి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది..అలాంటి హిట్ తర్వాత బోయపాటి శ్రీను ఎవరితో సినిమా చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం లో హీరో రామ్ పోతినేని తో ప్రాజెక్ట్ ప్రకటించి అందరిని షాక్ కి గురి చేసాడు..హీరో రామ్ తో ఆయనకీ ఇది మొదటి సినిమా..ఎప్పుడు యూత్ ఫుల్ లవ్ ఎంటెర్టైనెర్స్ తీసే రామ్ చాలా కాలం తర్వాత ఇటీవలే పూరి జగన్నాథ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమా తీసి భారీ హిట్ కొట్టిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇక అప్పటి నుండి రామ్ వరుసగా మాస్ సినిమాలకే కమిట్ అవుతూ వస్తున్నాడు..ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఆయన చేసిన మరో మాస్ మూవీ రెడ్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది..ఇప్పుడు ఆయన ఏకంగా ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో సినిమా చెయ్యబోతుండడం తో షూటింగ్ ప్రారంభం కాకముందు నుండే ఈ సినిమా పై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి..ఈ సినిమా అనుకున్న విధంగా భారీ హిట్ అయితే రామ్ వేరే లెవెల్ కి వెళ్ళిపోతాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు.

Also Read: Pushpa : సుకుమార్ కు పర్సనల్ మెసేజ్.. పుష్ప సినిమాపై బాలీవుడ్ టాప్ డైరెక్టర్ కామెంట్స్ వైరల్
ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..అదేమిటి అంటే ఈ సినిమా రామ్ బాలయ్య బాబు వీరాభిమాని గా నటించబోతున్నాడట..అంతే కాకుండా బాలయ్య బాబు సినిమాలకి సంబంధించిన రిఫరెన్స్ లు కూడా ఈ సినిమా లో ఫుల్ గా వాడేయబోతున్నారట..రామ్ లాంటి క్రేజీ హీరో బాలయ్య బాబు ఫ్యాన్ గా నటించడం అంటే నందమూరి అభిమానులకు పండగే అని చెప్పొచ్చు..ఇటీవలే పూజ కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంబించుకోనుంది..ప్రస్తుతం రామ్ హీరో గా నటించిన ‘వారియర్’ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని జులై 14 వ తేదీన విడుదల అవ్వడానికి సిద్ధం గా ఉంది..తమిళ టాప్ డైరెక్టర్ లింగు స్వామి తెరకెక్కించిన ఈ సినిమా లో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా, ప్రముఖ హీరో ఆది పినిశెట్టి విలన్ గా నటించాడు..తొలిసారిగా ఈ సినిమా ద్వారా రామ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు..ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 40 కోట్ల రూపాయలకు పైగానే జరిగినట్టు సమాచారం..భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

[…] […]
[…] […]