Balayya Babu : నందమూరి నటసింహంగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న హీరో బాలయ్య బాబు(Balayya Babu)… నందమూరి తారక రామారావు (NTR) గారి తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చి తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా మాస్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక 50 సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరో ప్రస్తుతం చేయబోతున్న సినిమాలతో మంచి విజయాలను అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు చేసినప్పటికి వాటన్నింటితో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు…ఇక బాలయ్య బాబు బోయపాటి శ్రీను(బోయపాటి Srinu) కాంబినేషన్ లో వచ్చిన అఖండ (Akhanda) సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమాని నార్త్ లో సైతం జనాలు విపరీతంగా ఆదరిస్తున్నారు. యూట్యూబ్ లో, ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఆ సినిమాను చూస్తూ ఆ సినిమా మీద కామెంట్స్ కూడా చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను మరోసారి తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో బాలయ్య బాబు ఉన్నట్టుగా తెలుస్తోంది.
Also Read : బాలయ్య ఫ్యాన్స్ కి పండగే..’డాకు మహారాజ్’ ఓటీటీ వెర్షన్ లో 15 నిమిషాల సరికొత్త సన్నివేశాలు!
ఇప్పటికే ఆయన బాలీవుడ్ మీద దండయాత్ర చేస్తున్న సమయంలో బాలయ్య బాబు సైతం తన సినిమాతో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలను అందుకున్న బాలయ్య ఇకమీదట వచ్చే అఖండ 2(Akhanda 2) సినిమాతో కూడా భారీ విజయాన్ని అందుకొని తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకుంటున్న స్టార్ డైరెక్టర్లందరూ మంచి సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక బోయపాటి సైతం తనకు గొప్ప గుర్తింపు రావాలనే ఉద్దేశంతోనే బాలయ్య బాబుతో చేస్తున్న అఖండ 2 సినిమాను పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు.
ఇక బాలీవుడ్ లో బాలయ్య బాబుకి చాలా మంచి క్రేజ్ అయితే దక్కుతోంది. దాన్ని వాడుకుంటూ ఇక మీదట రాబోయే సినిమాలతో కూడా ఆయన మంచి విజయాలను సాధిస్తే మాత్రం బాలీవుడ్ లో బాలయ్య చక్రం తిప్పే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.