Bigg Boss : చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు ప్రతీ ఒక్కరు ఇష్టపడే రియాలిటీ షోస్ లో ఒకటి బిగ్ బాస్(Bigg Boss). లండన్ లో పుట్టి పెరిగిన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన శిల్పా శెట్టి తో మన ఇండియా లోకి అడుగుపెట్టింది. కాన్సెప్ట్ మన ఇండియన్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చి సూపర్ హిట్ అవ్వడంతో మన ఇండియా లో ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా మొదలు పెట్టారు. అలా మన తెలుగు లో ఇప్పటి వరకు 8 సీజన్స్ ని ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో పూర్తి చేసుకుంది. అతి త్వరలోనే 9 వ సీజన్ కూడా మొదలు కాబోతుంది. ఇదంతా పక్కన పెడితే ఈ రియాలిటీ షో ద్వారా కెరీర్ అయిపోయింది అనుకున్న ఎంతో మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టి ఇప్పుడు టాప్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు.
అందుకు బెస్ట్ ఉదాహరణ శివాజీ. హీరో గా క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన శివాజీ , మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు దూరమయ్యాడు. మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నప్పుడు ఆయన బిగ్ బాస్ షో ద్వారా ఆడియన్స్ కి మరోసారి కనెక్ట్ అవ్వాలని అనుకున్నాడు. సినిమా ద్వారా సంపాదించిన క్రేజ్ కంటే బిగ్ బాస్ ద్వారా సంపాదించిన క్రేజ్ ఎక్కువ. ఇక ఆ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఏ రేంజ్ లో కొనసాగుతున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. అలా ఎంతో మంది ఉన్నారు. అంతే కాకుండా ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ మరియు ఇతర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పాపులారిటీ ని సంపాదించిన సెలబ్రిటీలు కూడా బిగ్ బాస్ షో లోకి కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొంది సినిమాల్లో అవకాశాలు సంపాదించుకునే రేంజ్ కి వెళ్లారు.
Also Read : ‘బిగ్ బాస్ 9’ లోకి అలేఖ్య చిట్టి..రెమ్యూనరేషన్ ఈ రేంజ్ లో ఇస్తున్నారా!
పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజా, గంగవ్వ, కిరాక్ సీత,అషూ రెడ్డి,షణ్ముఖ్ జస్వంత్, అలేఖ్య హారిక,గీతూ రాయల్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దది గా ఉంటుంది. వీళ్లంతా సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీ స్టేటస్ ని దక్కించుకొని ఆ తర్వాత బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి పాపులారిటీ ని సంపదించిన వాళ్ళే. పల్లవి ప్రశాంత్ అయితే టైటిల్ విన్నర్ గా కూడా నిలిచాడు. అయితే ఇక మీదట సోషల్ మీడియా సెలబ్రిటీలకు బిగ్ బాస్ లోకి ఎంట్రీ లేదా?, కేవలం టీవీ ఆర్టిస్ట్స్, మూవీ ఆరిస్ట్స్ కి మాత్రమే పరిమితం చేయబోతున్నారా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. త్వరలో ప్రారంభం అయ్యే హిందీ ‘బిగ్ బాస్ 19’ లో ఈ సరికొత్త రూల్ ని అమలు చేయబోతున్నారట. ఇదే రూల్ ని తెలుగు లో కూడా అనుసరించే అనుసరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.