Veera Simha Reddy Dialogues: భారీ అంచనాల నడుమ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీర సింహా రెడ్డి’ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది.. అఖండ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా అంచనాలు విపరీతంగా ఉండేవి.

ఆ అంచనాలను ఫస్ట్ హాఫ్ అందుకున్నప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం అందుకోలేకపోయిందని ప్రేక్షకులు అంటున్నారు.. కానీ నందమూరి అభిమానులకు మాత్రం బాలయ్య ని ఫ్యాక్షనిస్టు రోల్ లో డైరెక్టర్ గోపీచంద్ మలినేని చూపించిన తీరు బాగా నచ్చింది..అయితే ఈ సినిమాలో బాలయ్య బాబు అధికార వైసీపీ పార్టీపై పరోక్షంగా చేసిన విమర్శలు ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనంగా మారాయి.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో చేస్తున్న అరాచకాలపై బాలయ్య జూలు వదిలిన సింహం లాగా రెచ్చిపోయి విమర్శలు చేసాడు.. కొత్త పరిశ్రమలు పెట్టుబడులను ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టాలంటే భయపడిపోవడం..ఉన్న పరిశ్రమలు కూడా ఇక్కడ జరుగుతున్నా విధ్యంసాలను చూసి పారిపోవడం వంటి వాటిపై బాలయ్య చేత సెటైర్స్ గా వేయించాడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. థియేటర్స్ లో ఈ సన్నివేశాలకు అదిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది..ముఖ్యంగా అభివృద్ధి అంటే ఏమిటో ఈ చిత్రం లో హోమ్ మినిస్టర్ కి బాలయ్య బాబు చెప్పే నిర్వచనం, ఆ సన్నివేశం లో బాలయ్య ఉపయోగించిన పదాలు , రైమింగ్ థియేటర్స్ లో ఆడియన్స్ చేత విజిల్స్ వేయించేలా చేసింది.

వీటిపై సోషల్ మీడియాలో వైసీపీ పార్టీ అభిమానులు మరియు కార్యకర్తలు బాలయ్యపై చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.. బాలయ్య ని జగన్ ఎప్పుడూ గౌరవిస్తూ ఉంటాడని..కానీ బాలయ్య మాత్రం ఇలా నోటికి వచినట్టు మాట్లాడడం ఏమాత్రం బాలేదని..వీర సింహా రెడ్డి సినిమాని వైసీపీ అభిమానులు బాయ్ కట్ చేయాలంటూ సోషల్ మీడియా లో నినాదాలు చేస్తున్నారు