Balakrishna Vishnu Combo Film: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు (NTR) గారు ఎనలేని కీర్తి ప్రతిష్టలను అందుకొని తెలుగు సినిమా స్థాయిని పెంచాడనే చెప్పాలి. ఆయన చేసిన సినిమాలు ఇప్పటివరకు ఏ ఒక్క హీరో చేయలేకపోయాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. తన ఎంటైర్ కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులందరిని తనవైపు తిప్పుకున్న ఒకే ఒక నటుడు కూడా తనే కావడం విశేషం…
నందమూరి తారకరామారావు గారి పేరు చెబితే చాలు తెలుగువాళ్లందరి బాడీ లో ఒక వైబ్రేషన్ అయితే స్టార్ట్ అవుతోంది…రాముడిగా, కృష్ణుడిగా, అర్జునుడిగా, కర్ణుడిగా, దుర్యోధనుడిగా ఎన్నో పౌరాణిక పాత్రల్లో కనిపించిన ఏకైక నటుడు కూడా తనే కావడం విశేషం… ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమాని ముందుకు తీసుకెళ్లిన ఘనత కూడా తనకే దక్కుతోంది. ఇక తన నట వారసుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన నటుడు బాలయ్య బాబు (Balayya Babu)…ఈయన కెరియర్ స్టార్టింగ్ లోనే చాలా మంచి సినిమాలు చేసి తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగాడు. ఇక ఇప్పటికే వరుసగా 4 సినిమాలను చేసి మంచి విజయాలను అందుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో ఈయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి వరుసగా నాలుగు విజయాలతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఆయన రాబోయే ‘ అఖండ 2’ (Akhanda 2) సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు…ఇక ఇండస్ట్రీ లో వీళ్ళతో పాటు మోహన్ బాబు (Mohan Babu) కూడా మంచి నటుడిగా ఎదిగాడు. మొదటి నుంచి కూడా నందమూరి ఫ్యామిలీకి, మంచు ఫ్యామిలీకి చాలా మంచి అనుబంధమైతే ఉంది.
Also Read: Balakrishna : 64 ఏళ్ళ వయస్సులో లవ్ స్టోరీ చేయబోతున్న బాలకృష్ణ..డైరెక్టర్ ఎవరంటే!
మోహన్ బాబు సైతం సీనియర్ ఎన్టీఆర్ ని అన్నయ్య అని పిలుస్తూ చాలా మర్యాదగా మాట్లాడుతూ ఆయన సినిమాల్లో చాలా అవకాశాలను అందుకొని ఎన్టీఆర్ గారి చేతే గొప్ప నటుడు అనే కీర్తి ప్రతిష్టలను కూడా అందుకున్నాడు. ఇక తన నట వారసుడిగా వచ్చిన మంచు విష్ణు (Vishnu) సైతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
ఇక అప్పట్లో బాలయ్య బాబు – మంచు విష్ణు కాంబినేషన్లో రావాల్సిన ఒక సినిమా రాలేకపోయింది. కారణం ఏంటంటే బాలయ్య బాబు అప్పుడు కొన్ని సినిమాల్లో బిజీ గా ఉండటం వల్ల ఈ కాంబినేషన్ అయితే సెట్ అవ్వలేదు. ఇక ఇది జరిగిన కొద్దిరోజుల తర్వాత మంచు విష్ణు చేసిన ‘కృష్ణార్జున’ (Krishnarjuna) సినిమాలో సైతం కృష్ణుడిగా బాలయ్య బాబును తీసుకోవాలనే ప్రయత్నం చేసినప్పటికి ఆ క్యారెక్టర్ కి పెద్దగా ఇంప్రెస్ అవ్వకలేకపోయిన బాలయ్య ఆ పాత్రను చేయలేకపోయాడు.
దాంతో నాగార్జున ఆ క్యారెక్టర్ ని చేసి మెప్పించాడు. మరి ఏది ఏమైనా కూడా బాలయ్య బాబుతో మంచు విష్ణు రెండుసార్లు కలిసి నటించాలి అనుకున్నప్పటికి అది అయితే వర్కౌట్ కాలేదు. కానీ మంచు విష్ణు వాళ్ల తమ్ముడు అయిన మంచు మనోజ్ మాత్రం ఊ కొడతారా ఉలిక్కిపడతారా అనే సినిమాలో బాలయ్య బాబు చేత ఒక స్పెషల్ క్యారెక్టర్ చేయించాడు…