Pushpa Villain New Car: విలక్షణ నటుడిగా పేరున్న ఫహద్ ఫాజిల్(FAHADH FAASIL) టాలీవుడ్ లో సైతం పాప్యులర్ అయ్యాడు. పుష్ప, పుష్ప 2 చిత్రాలు ఆయనకు భారీ ఫేమ్ తెచ్చాయి. పుష్ప చిత్రంలో పోలీస్ అధికారి భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో అద్భుతం చేశాడు ఫహద్ ఫాజిల్. పుష్ప, పుష్ప 2(PUSHPA 2) విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. పుష్ప కి మించి పుష్ప 2 విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా నార్త్ లో పుష్ప 2 రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఇండియాలో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రాల జాబితాలో నిలిచింది.
మరోవైపు నటుడిగా, నిర్మాతగా కూడా విజయపథంలో దూసుకువెళుతున్నాడు ఫహద్ ఫాజిల్. ఆయన నటించిన నిర్మించిన మలయాళ చిత్రం ఆవేశం భారీ విజయం అందుకుంది. పెద్ద మొత్తంలో లాభాలు తెచ్చిపెట్టింది. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఫహద్ వరుస చిత్రాలు చేస్తున్నారు. క్షణం తీరిక లేకుండా ఆయన నటిస్తున్నారు. కాగా ఫహద్ ఫాజిల్ ఓ లగ్జరీ కారు సొంతం చేసుకున్నాడు. వోక్స్ వ్యాగన్ గోల్ఫ్ GTI(Volkswagen Golf GTI) ని ఫహద్ ఫాజిల్ కొనుగోలు చేశాడు. ఇండియన్ మార్కెట్ లోకి వచ్చిన వోక్స్ వ్యాగన్ గోల్ఫ్ GTI 150 యూనిట్స్ లో ఇది ఒకటి కావడం విశేషం. గ్రెనెడిల్లా బ్లాక్ మెటాలిక్ కలర్ లో ఉన్న ఈ కారు ధర రూ. 53 లక్షలు(ఎక్స్ షోరూమ్) అని సమాచారం.
పవర్ ప్యాక్డ్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ కారు 265 హార్స్ పవర్, 270 Nmను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 5.9 సెకన్స్ లో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇప్పటికే ఫహద్ ఫాజిల్ గ్యారేజ్ లో పలు లగ్జరీ ఉన్నాయి. మినీ కంట్రీమ్యాన్, లబోర్గిని ఉరుస్, ఫోర్షే 911, ల్యాండ్ రోవర్ డిఫెండర్ కార్లు ఈ జాబితాలో ఉన్నాయి. తాజాగా వోక్స్ వ్యాగన్ గోల్ఫ్ GTI వచ్చి చేరింది.
ఫహద్ నటిస్తున్న దాదాపు ఐదు చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. తెలుగులో ఆయన డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ టైటిల్ తో మూవీ చేస్తున్నాడు. అలాగే మరీసన్ టైటిల్ తో ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నారు. మూడు మలయాళ చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఫహద్ ఫాజిల్ వైఫ్ నజ్రియా సైతం హీరోయిన్ గా రాణిస్తుంది. తెలుగులో నానికి జంటగా అంటే సుందరానికీ చిత్రం చేసింది. ఇటీవల ఆమె నటించిన సూక్ష్మదర్శిని విజయం సాధించింది.