నందమూరి బాలకృష్ణ తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెల్సిందే. పూర్తి యాక్షన్ ఎంటటైనర్ గా మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్లకు అవకాశం దక్కనుంది. బాలయ్యకు జోడీగా నయనతార, శ్రియ నటిస్తారనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా మరో బొద్దుగమ్మ పేరు తెరపైకి వచ్చింది. బాలయ్య జోడీగా తెలుగమ్మాయి అంజలి ఎంపికైనట్లు తెలుస్తోంది.
ఈ మూవీలో ఒక పాత్రలో బాలయ్య అఘోరగా కనిపించనున్నాడు. దీనికోసం బాలయ్య గుండు చేయించుకున్నట్లు తెలుస్తోంది. ప్లాష్ బ్యాక్లో వచ్చే సన్నివేశాల్లో బాలయ్య అఘోరగా అలరించనున్నట్లు తెలుస్తోంది. వారణాశిలో ఇందుకు సంబంధించిన షూటింగ్ చిత్రీకరించనున్నారు. బాలయ్యతో దర్శకుడు బోయపాటి శ్రీను ఇది మూడో చిత్రం. ఇప్పటికే ‘లెజండ్’, ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. దీంతో వీరి కాంబినేషన్లో హ్యట్రిక్ హిట్టు ఖాయమనే ధీమాతో నందమూరి అభిమానులు ఉన్నారు.
నందమూరి బాలకృష్ణ సరసన అంజలి ‘డిక్టెటర్’ మూవీలో నటించింది. బాలయ్యకు తగ్గ జోడిగా అంజలి మెప్పించింది. డిక్టెటర్ మూవీ ఘన విజయం సాధించింది. తాజాగా బోయపాటి శ్రీను బాలకృష్ణతో నిర్మించే మూవీలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఈ మూవీలో ఇప్పటికే ప్రధాన హీరోయిన్లుగా నయనతార, శ్రియ పేర్లు విన్పించాయి. అయితే అంజలి సెకండ్ హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. దీంతో బాలయ్య సరసన అంజలి ఖరారైనట్లు సమాచారం. నయతార పేరు ప్రధానంగా విన్పించినా ఆమె బిజీగా ఉండటంతో చివరకు శ్రియను తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.