Balakrishna Koratala Siva Movie: నందమూరి నటసింహం బాలయ్య బాబు ప్రస్తుతం డిఫరెంట్ సినిమాలను చేస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇలాంటి క్రమంలోనే ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సన్న హలు చేసుకున్నాడు. ఒక కొరటాల శివ డైరెక్షన్లో వచ్చే సినిమాలు చాలా స్లో నెర్షన్ తో ఉంటాయి. బాలయ్య బాబు కి అలాంటి స్లో నేరేషన్ అయితే ఇష్టం ఉండదు. ఆయన సినిమాల్లో సీన్స్ ఫటాఫట్ వెళ్ళిపోతూనే ఉండాలి. ఎక్కడా కూడా స్లో నేరేషన్ తో సినిమా వెళితే మాత్రం బాలయ్య అసలు ఇష్టపడడు. ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు కొరటాల శివ స్క్రీన్ ప్లే ను చేంజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి తోడుగా ఈ సినిమా బడ్జెట్ ని కూడా మారుస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఆ విషయంలోనే బాలయ్య కొంతవరకు కొరటాల మీద సీరియస్ అవుతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. మొదట అనుకున్నా బడ్జెట్లోనే సినిమాని తీసి పెట్టాలని బడ్జెట్ ఓవర్ గా అయితే ప్రొడ్యూసర్ కి నష్టాలు వస్తాయి. తద్వారా సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని మరి కొంతమంది సినిమా మేధావులు చెబుతున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య మాత్రం చాలా తక్కువ బడ్జెట్ లో సినిమాని తెరకెక్కించి సక్సెస్ సాధించి చూపించాలనే ప్రయత్నంలో కొరటాల శివకు చెప్పినట్టుగా తెలుస్తుంది. తను అనుకున్నది అనుకున్నట్టుగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయ గలుగుతాడా? లేదా అలాగే బాలయ్య బాబుకి భారీ విజయాన్ని కట్టబెడుతాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. కొరటాల ఎఫెక్టివ్ గా తీయగలిగితే మాత్రం ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా బాలయ్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని నమోదు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి…
