spot_img
Homeఎంటర్టైన్మెంట్Balakrishna rejects Harish Shankar movie: హరీష్ శంకర్ ని రిజెక్ట్ చేసిన బాలయ్య.. ఇక...

Balakrishna rejects Harish Shankar movie: హరీష్ శంకర్ ని రిజెక్ట్ చేసిన బాలయ్య.. ఇక ఇతనికి అవకాశాలు ఇచ్చే హీరో ఎవరు?

Balakrishna rejects Harish Shankar movie: టాలీవుడ్ లో ఒకప్పుడు మినిమం గ్యారంటీ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా హరీష్ శంకర్(Harish Shankar) పేరు ఉండేది. ‘షాక్’ చిత్రం తో వెండితెర అరంగేట్రం చేసిన ఆయన, ఆ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయినప్పటికీ, మేకింగ్ విషయం లో హరీష్ శంకర్ కి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత కొన్నాళ్ళకు అదే రవితేజ తో కలిసి ఆయన చేసిన ‘మిరపకాయ్’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరో గా ఈయన దర్శకత్వం లో తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాసింది. ఓవర్ నైట్ లో హరీష్ శంకర్ ని స్టార్ డైరెక్టర్ ని చేసింది. పూరి జగన్నాథ్, వీవీ వినాయక్ తర్వాత టాలీవుడ్ కి మంచి కమర్షియల్ డైరెక్టర్ దొరికాడని అంత అనుకున్నారు.

ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో ఆయన తీసిన ‘రామయ్య వస్తావయ్యా ‘ చిత్రం ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ ఆ తర్వాత ఆయన తీసిన ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘డీజే’, ‘గడ్డలకొండ గణేష్’ వంటి చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. కానీ ఇన్ని సినిమాలతో ఆయన సంపాదించుకున్న పేరు మొత్తం ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం తో పోగొట్టుకున్నాడు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ అవ్వడమే కాదు, విడుదలకు ముందు హరీష్ శంకర్ ఇంటర్వూస్ లో చేసిన అతి , యూత్ ఆడియన్స్ లో ఆయనపై తీవ్రమైన ద్వేషం పెరిగేలా చేసింది. అది ఆయన రీసెంట్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై తీవ్రమైన ప్రభావం చూపించింది అనడం లో ఎలాంటి సందేహం లేదు. అంతే కాకుండా 2026 లో కూడా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లాంటి రొటీన్ కమర్షియల్ సినిమా తియ్యాలని ఆలోచన వచ్చినప్పుడే హరీష్ శంకర్ బుర్ర ఎక్కడ ఆగిపోయిందో అర్థం అవుతుందంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ అంటున్నారు.

Also Read: తెలుగులో శ్రీలీల కెరీర్ ఇక ముగిసినట్టే.. చివరికి పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేకపోయాడు!

‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదలకు ముందు హరీష్ శంకర్ బాలయ్య తో ఒక సినిమా కమిట్ అయ్యాడు. ఇప్పుడు ‘ఉస్తాద్’ ఫలితం చూసిన తర్వాత బాలయ్య హరీష్ శంకర్ ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేసాడు. ఆయనకు బదులుగా వివేక్ ఆత్రేయ తో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం హరీష్ శంకర్ తో ‘సితార ఎంటర్టైన్మెంట్స్’, ‘KVN ప్రొడక్షన్స్’ ఇచ్చిన అడ్వాన్స్ లు ఉన్నాయి. కానీ ఏ హీరో కూడా ఆయనతో సినిమాలు చేయడానికి మొగ్గు చూపడం లేదు. కనీసం రామ్ లాంటి హీరోలు కూడా ఆయనతో సినిమాలు చెయ్యడానికి భయపడుతున్నారు అంటేనే అర్థం చేసుకోవచ్చు, ప్రస్తుతం హరీష్ శంకర్ పరిస్థితి ఏంటి అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version