Balakrishna: తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసిన హీరోలలో నందమూరి తారక రామారావు గారు మొదటి స్థానంలో ఉంటారు. ఈయన చేసిన ప్రతి సినిమా ఒకప్పుడు సూపర్ సక్సెస్ లు అందుకోవడమే కాకుండా తెలుగు లో మంచి సినిమాలు రావడానికి కూడా ఆయన చాలావరకు కృషి చేశారు. ముఖ్యంగా పౌరాణిక పాత్రల్లో ఆయనను మించి నటించేవారు ఇండియాలోనే మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈయన తర్వాత వీళ్ళ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన హీరోలలో హరికృష్ణ, బాలకృష్ణ లు ప్రథమ స్థానంలో ఉంటారు.
అయితే హరికృష్ణ అడపాదడప సినిమాలు చేస్తూ హీరోగా పెద్దగా క్లిక్ అవ్వకపోవడంతో ఎన్టీఆర్ మాత్రం తన నట వారసుడిగా బాలయ్య బాబుని ఇండస్ట్రీకి పరిచయం చేసి ఆయనతో ఎక్కువ మంది పెద్ద దర్శకులు సినిమాలు చేసే విధంగా ప్రోత్సహిస్తూ వచ్చాడు. ఇక ఆ క్రమంలోనే బాలయ్య బాబుని స్టార్ హీరోగా నిలిపారు. ఇక అదే ఉత్సాహంతో బాలయ్య అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరో గా ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే నందమూరి ఫ్యామిలీతో మంచి సన్నిహిత్యం ఉన్న దర్శకులలో వైవిఎస్ చౌదరి ఒకరు. ఈయన దర్శకుడుగానే కాకుండా ప్రొడ్యూసర్ గా మారి బొమ్మరిల్లు క్రియేషన్స్ అనే ఒక బ్యానర్ ని కూడా ఏర్పాటు చేశాడు.
అయితే దానికి లోగో గా ‘నందమూరి తారక రామారావు’ గారి ఫోటోని వాడుకోవడం అనేది ఆయనకు ఎన్టీయార్ మీద గాని, నందమూరి ఫ్యామిలీ మీద గాని ఉన్న అభిమానాన్ని జనాలకు తెలియజేస్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన బాలయ్య బాబుతో కొన్ని సినిమాలను చేయాలనుకున్నాడు. కానీ బాలయ్య వాటిని రిజెక్ట్ చేయడంతో ఆ సినిమాలను హరికృష్ణతో చేశాడు. అలా వచ్చినవే లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య. ఈ రెండు సినిమాలను చేసి సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. ఇక బాలయ్య రిజెక్ట్ చేసిన తర్వాతనే హరికృష్ణతో ఈ సినిమాలు చేయడం అనేది విశేషం… అయితే ఈ రెండు సినిమాలు మంచి విజయాలు సాధించాయి.ఇక బాలయ్య అప్పుడు వైవిఎస్ చౌదరి తో మన కాంబినేషన్ లో కూడా ఒక సినిమా చేద్దాం ఒక మంచి కథ రెడీ చేసుకో అని చెప్పారట.
దాంతో వైవిస్ చౌదరి బాలయ్యను హీరోగా పెట్టి ‘ఒక్క మగాడు ‘ అనే సినిమా చేశాడు. ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఈ న్యూస్ తెలుసుకున్న చాలా మంది అభిమానులు వై వి ఎస్ చౌదరి డైరెక్షన్ లో లాహిరి లాహిరి లాహిరి లేదా సీతయ్య సినిమాలు చేస్తే బాలయ్య బాబు కెరియర్ పరంగా బాగా యూజ్ అయ్యేదని అవి రెండింటిని వదిలేసి ఒక్క మగాడు సినిమా చేయడం ఆయన కెరియర్ కే ఒక భారీ దెబ్బ గా మారిందంటూ ఇప్పటికీ బాలయ్య బాబును సినిమా విమర్శకులు సైతం విమర్శిస్తూ ఉంటారు…