SBI: మీరు ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులు వినియోగిస్తున్నారా.. అయితే మీకు ఓ షాకింగ్ న్యూస్. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఎస్బీఐ కొత్త రూల్స్ అమలులోకి తెచ్చింది. వివిధ కార్డుల సర్వీస్ చార్జీలను భారీగా పెంచేసింది. మీరు క్లాసిక్, సిల్వర్, కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డులు వినియోగిస్తున్నట్లు అయితే వాటి వార్షిక మెయిటనెన్స్ చార్జీ125 + జీఎస్టీ నుంచి ఏకంగా 200 + జీఎస్టీకి పెంచేసింది. వీటితోపాటు..
= యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డులు వినియోగిస్తే.. వీటిపై ప్రస్తుతం వార్షిక మెయిటనెన్స్ చార్జి రూ.175 + జీఎస్టీ నుంచి రూ.250 + జీఎస్టీకి పెంచింది.
= ఇక ప్లాడినం డెబిట్ కార్డు వార్షిక సర్వీస్ చార్జీని రూ.250+జీఎస్టీ నుంచి రూ.325+జీఎస్టీకి పెంచేసింది.
= ప్రైడ్ లేదా ప్రీమియం బిజినెస్ డెబిట్ కార్డు వార్షిక సర్వీస్ రూ.350+ జీఎస్టీ నుంచి ఏకంగా రూ.425+ జీఎస్టీకి పెంచింది.
రివార్డు పాయింట్లు ఎత్తివేత..
ఇంతే కాకుండా ఎస్బీఐ క్రెడిట్ కార్డును వినియోగిస్తే ఇంతకాలం ఆకార్డుతో ఇంటి అద్దె కట్టినట్లయితే రివార్డు పాయింట్లు వచ్చేవి. ఏప్రిల్ 1 నుంచి ఈ రివార్డు పాయింట్లను కూడా ఎస్బీఐ ఎత్తేసింది.
మొత్తంగా 2024–25 కొత్త వార్షిక సంవత్సం నుంచి ఎస్బీఐ వినియోగదారులకు షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. అందరి వద్ద ఏదో ఒక రకమైన కార్డు ఉన్నందున అందరిపైనా ఎంతో కొంత భారం పడడం ఖాయం.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Sbi hikes annual maintenance charges
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com