Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు రీసెంట్ గా చేసిన సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన ‘అఖండ 2’ సినిమా తీవ్రంగా నిరాశపర్చినప్పటికి ఆయన చేసిన సినిమాలన్నీ వేరే రేంజ్ లో ఉంటాయని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇక బాలయ్య నుంచి వచ్చే ప్రతి మాస్ సినిమాను ప్రేక్షకులు విశేషంగా ఎంజాయ్ చేసే అవకాశాలైతే పుష్కలంగా ఉంటాయి… ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా ‘కొరటాల శివ’ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు.
ఇక ఇప్పటికే ఈ రెండు సినిమాల మీద బాలయ్య బాబు అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో బాలయ్య బాబు సినిమా ఉంటుందని గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి. కానీ బాలయ్య మాత్రం వివేక్ ఆత్రేయ సినిమాను పక్కన పెట్టేసినట్టుగా తెలుస్తుంది. కారణమేంటంటే వివేక్ రాసిన కథ బాగున్నప్పటికి అది భారీ బడ్జెట్ తో కూడుకున్నదిగా తెలుస్తుంది.
దానివల్ల బాలయ్య మార్కెట్ కి మించి బడ్జెట్ పెట్టడం అంటే చాలా కష్టతరమైన విషయం…అందువల్లే బాలయ్యే కావాలని దాని బడ్జెట్ ను తగ్గిస్తే తగ్గించండి లేకపోతే ప్రాజెక్ట్ చేసే అవకాశం లేదని చెప్పేశారట. దాంతో వివేక్ ఫ్యూచర్లో బడ్జెట్ ను తగ్గించి బాలయ్యతో సినిమా చేస్తాడా? లేదంటే ఇతర హీరోలతో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది…
ఇక వివేక్ ఆత్రేయ ఇంతకు ముందు మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, అంటే సుందరానికి, సరిపోదు శనివారం లాంటి సినిమాలు చేశాడు. ఈ సినిమాలన్నీ కూడా మంచి విజయాలను సాధించడంతో దర్శకుడిగా వివేక్ కి మంచి గుర్తింపైతే లభించింది. తన నుంచి సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అలాంటి దర్శకుడు ఇప్పుడు బాలయ్య బాబుతో సినిమా చేసి మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంటాడా? లేదంటే ఇతర హీరోల వైపు మొగ్గు చూపుతాడా అనేది తెలియాల్సి ఉంది…
