Balakrishna- Mohan Babu: కొన్నిసార్లు అదృష్టం కలిసి రాదు. దీంతో మనకు నష్టం జరుగుతుంది. మనమొకటి అనుకుంటే విధి మరొకటి చేస్తుంది. అదే దురదృష్టం అంటే. సినిమా పరిశ్రమలో ఈ తరహా సంఘటనలు కోకొల్లలుగా ఉంటాయి. మనం వద్దనుకున్న ప్రాజెక్టే ఇతరులకు అన్నపూర్ణగా మారుతుంది. మనం కాదనుకున్న సినిమాయే మరొకరికి బ్లాక్ బస్టర్ అవుతుంది. దీంతో మనం తల పట్టుకుంటాం. అయ్యో ఎందుకు వదిలేసుకున్నామా అని సందేహిస్తుంటాం. కానీ అప్పటికే జరగాల్సిన తంతు మొత్తం జరిగిపోతోంది. ఇలాంటి ఓ సంఘటనే బాలకృష్ణ జీవితంలోనూ చోటుచేసుకుంది.
Balakrishna- Mohan Babu
గతంలో మోహన్ బాబు హీరోగా వచ్చిన అల్లుడుగారు ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. అందులో నటించినందుకు మోహన్ బాబుకు మంచి గుర్తింపు దక్కింది. ఇక అప్పటి నుంచే నిర్మాతగా నిలదొక్కుకున్నాడు. తరువాత అన్ని సూపర్ డూపర్ హిట్లు రావడంతో నిర్మాతగా మంచి పొజిషన్ కు వచ్చాడు. తన తలరాతను మార్చింది ముమ్మాటికి అల్లుడుగారే. ఆ సినిమా అందించిన విజయంతోనే మోహన్ బాబు తెలుగు సినిమాలో నిలబడ్డాడనేది వాస్తవం.
Also Read: Sadhguru Satires On Samantha: మధ్యలో బట్టలు మార్చుకొని వచ్చింది… సమంతపై సద్గురు సెటైర్స్
ఇది మలయాళ సినిమాకు రీమేక్. దీని హక్కులు మొదట సుహాసిని మేనేజర్ దక్కించుకుని సుహాసిని, బాలకృష్ణతో ఈ సినిమా నిర్మించాలని ప్లాన్ చేశారట. కానీ సెంటిమెంట్ బాగా ఉందని తనకు సరిపోదని బాలకృష్ణ ఒప్పుకోలేదు. ఆయన ఒప్పుకుంటే మరో సూపర్ డూపర్ హిట్ ఆయన ఖాతాలో పడేది. కానీ కాలం కలిసి రాకపోవడంతో ఆయన వద్దనుకున్న సినిమా మోహన్ బాబు చేతుల్లోకి వెళ్లింది. దీంతో మోహన్ బాబుకు బ్లాక్ బస్టర్ కావడంతో నిర్మాతగా పరిశ్రమలో మంచి స్థానం సంపాదించుకున్నాడు.
Balakrishna- Mohan Babu
ఇక దర్శకుడు రాఘవేంద్ర రావు అప్పటికే జగదేకవీరుడు అతిలోక సుందరి హిట్ తో మంచి దూకుడు మీద ఉన్నాడు. మోహన్ బాబకు అన్ని ప్లాపులే. దీంతో మోహన్ బాబుతో సినిమా చేస్తే అది తప్పకుండా ప్లాపే అనే సంకేతాలు వచ్చినా రాఘవేంద్రరావు లెక్కచేయలేదు. రమ్యకృష్ణ, శోభన హీరోయిన్లుగా ఎంచుకుని సినిమాను హృద్యంగా తెరకెక్కించారు. దీంతో సినిమా ఘన విజయం సాధించింది. అందరికి గుర్తింపు తీసుకొచ్చింది. అలా బాలకృష్ణ వద్దనుకున్న సినిమా మోహన్ బాబుకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఓడలు బండ్లవుతాయి బండ్లు ఓడలవుతాయంటే ఇదేనేమో.
Also Read:NTR30 Release Date: NTR30 విడుదల తేదీ వచ్చేసింది.. అభిమానులకు ఇక పండగే