Senior Hero Naresh Third Marriage: తెర ముందు నటించే నటుల జీవితాలు తెర వెనుక విచిత్రంగా ఉంటాయి. మనకే ఆశ్చర్యం వేస్తుంది. కదిలే బొమ్మల గురించి వాస్తవాలు తెలిస్తే షాకే. అంతటి దుర్భరమైన జీవితాలు వారి సొంతమే. కానీ తెర మీద మాత్రం అవేమీ కనిపించకుండా జాగ్రత్తలు పడుతుంటారు. వ్యక్తిగత జీవితాల విషయానికి వస్తే అందరికి బాధలే కనిపిస్తాయి. ఇక సీనియర్ నరేష్ విషయంలో కూడా ఇవి తారసపడతాయి. ఆయన ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నటి, నిర్మాత, దర్శకురాలు విజయనిర్మల వారసుడిగా ఆయనకు పరిచయం అక్కర్లేదు. 1980-90వ దశకంలో ఓ వెలుగు వెలిగిన హీరో కావడం విశేషం.

విజయనిర్మల బతికుండగానే నరేష్ కు మొదట రేఖ అనే ఓ అందమైన అమ్మాయిని చూసి వివాహం చేసింది. కానీ వారి మధ్య మనస్పర్దలు రావడంతో ఆమె ఎంతో కాలం ఉండలేదు. వారికి ఓ కుమారుడు ఉన్నాడు. పేరు నవీన్. హీరోగా కూడా ప్రయత్నించాడు. రేఖకు నరేష్ కు పడకపోవడంతో ఇద్దరు దూరంగా ఉన్నారు. తరువాత తన సినిమాకు సహాయ దర్శకురాలిగా పనిచేసిన రమ్య అనే అమ్మాయిని కూడా రెండో పెళ్లి చేసుకున్నాడు. రమ్య అప్పటి ఏపీ మంత్రి రఘువీరారెడ్డికి స్వయానా తమ్ముడి కూతురు. వారి పెళ్లికి ఆయన కూడా వచ్చారు.
Also Read: Balakrishna- Mohan Babu: మోహన్ బాబు, బాలయ్య.. ఆ సినిమా ఎందుకు వదులుకున్నాడు?
రమ్యతో కూడా నరేష్ కు మనస్పర్దలు రావడంతో వేరుగానే ఉంటున్నాడు. ఇటీవల రమ్య పలు నేరాల్లో దొరికిపోవడంతో ఆమెకు తనకు ఎలాంటి సంబంధం లేదని నరేష్ ఓ వీడియో కూడా పెట్టాడు. దీంతో ప్రస్తుతం నరేష్ ఒంటరిగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఇటీవల పవిత్ర లోకేష్ అనే ఆవిడతో చాలా సన్నిహితంగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏ ఫంక్షన్లకు వెళ్లినా ఆమెతోనే వెళ్తున్నట్లు చెబుతున్నారు. నరేష్ వల్లే ఆమెకు సినిమాల్లో చాన్సులు కూడా వవ్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి నరేష్ ఆమెను మూడో వివాహం చేసుకుంటాడనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఆమె వయసు కూడా నరేష్ కు దగ్గరగా ఉండటంతో ఇక వారి వివాహం ఖాయమనే సంకేతాలు రావడం గమనార్హం.

నరేష్ కు ఆస్తులు కూడా భారీగానే ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలలో స్థిరాస్తులు ఉన్నట్లు తెలిసిందే. విజయనిర్మల సూపర్ స్టార్ కృష్ణకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు అందించి ఆయన ఉన్నతికి ఉపయోగపడింది. ఆమె రాకతోనే కృష్ణకు కూడా కలిసొచ్చినట్లు చెబుతారు. దీంతో నరేష్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా నష్టమేమీ లేదు. కానీ ముచ్చటగా మూడో పెళ్లికి మాత్రం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా పరిశ్రమలో ఎన్నో వింతలు విశేషాలు చోటుచేసుకోవడం మామూలే.
Also Read:Sadhguru Satires On Samantha: మధ్యలో బట్టలు మార్చుకొని వచ్చింది… సమంతపై సద్గురు సెటైర్స్