Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలయ్య బాబుకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయనతో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు సైతం పోటీ పడుతున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటివరకు బాలయ్య చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇక ఇప్పుడు ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా వరకు క్లారిటీ మెయింటైన్ చేస్తున్నాడు… సినిమా సినిమాకి మధ్య వేరియేషన్స్ ని చూపించాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికి దర్శకులు మాత్రం అతని దగ్గరికి కమర్షియల్ సినిమాలనే తీసుకొస్తున్నారు. దానివల్ల బాలయ్య సైతం రొటీన్ సినిమాల వైపే అడుగులు వేస్తున్నాడు.
చారిత్రక నేపథ్యంలో ఒక భారీ బడ్జెట్ సినిమాను చేయాలనే ఉద్దేశ్యంతో బాలయ్య ఉన్నప్పటికి బడ్జెట్ భారీగా పెరిగిపోతుండడం వల్ల గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోయే ఆ సినిమాను క్యాన్సిల్ చేసి ఒక కమర్షియల్ స్టోరీ తో ముందుకు సాగుతున్నారు…ఇక బాలయ్య సోలో హీరోగా రాణిస్తున్నప్పటికి రజనీకాంత్ తో కలిసి మల్టీ స్టారర్ సినిమా చేయాలని ఉందట.
అలాంటి కథ తన దగ్గరికి తీసుకొస్తే పక్కాగా రజనీకాంత్ తో కలిసి నటిస్తానని బాలయ్య చెబుతున్నాడు. ఈ సినిమాలో బాలయ్య ఒక క్యామియో రోల్ పోషిస్తున్నాడు అంటూ గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి. కానీ అది ఎంతవరకు నిజం అనే విషయంలో క్లారిటి రావడం లేదు… ఇప్పటివరకు బాలయ్య చేసిన ప్రతి సినిమాను టాప్ లెవల్లో నిలపడానికి తీవ్రమైన ప్రయత్నం చేశాడు.
కానీ తను అనుకున్నట్టుగానే వరుసగా 4 సక్సెసులైతే దక్కాయి. ఇక ఆ తర్వాత బోయపాటితో చేసిన ‘అఖండ 2’ మూవీ భారీ డిజాస్టర్ ను మూట గట్టుకోవడంతో ఆయన చాలా వరకు వెనుకబడిపోయాడు… ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నింటిని టాప్ లెవెల్లో నిలుపడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. తద్వారా ఆయనకున్న ఇమేజ్ మరింత రెట్టింపు చేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…