Balakrishna- Geetha Arts: టాలీవుడ్ లో ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ ఊపు ఏ స్థాయి లో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..కెరీర్ చివర్లో బాలయ్య బాబు సీనియర్ హీరోలెవరు కూడా ఎంజాయ్ చెయ్యని యుఫొరియా ని ఎంజాయ్ చేస్తున్నాడు..గత ఏడాది విడుదలైన అఖండ సినిమా ఆయనకీ తెచ్చిపెట్టిన క్రేజ్ అలాంటిది మరి..నాసిరకపు డైరెక్టర్స్ తో వరుసగా సినిమాలు చేసి సింగల్ డిజిట్ రేంజ్ క్లోసింగ్ కలెక్షన్స్ ని కూడా చూసిన బాలయ్య..ఇప్పుడు టాలీవుడ్ లో ట్రెండీ యంగ్ డైరెక్టర్స్ తో వరుసగా సినిమాలు చేస్తూ తన మార్కెట్ గ్రాఫ్ ని అమాంతం పెంచేసుకున్నాడు.

వీటితో పాటు బాలయ్య బాబు ని ఆహా మీడియా లో ప్రసారం అయ్యే ‘అన్ స్టాపబుల్ విత్ NBK ‘ ప్రోగ్రాం ఆయనని యూత్ కి బాగా చేరువ చేసింది..మొదటి నుండి అల్లు కుటుంబంతో బాలయ్య బాబు కి ఉన్న మంచి సాన్నిహిత్యం వల్ల బాలయ్య బాబు ఈ షో చేసాడు..ఈ షో తో అల్లు అరవింద్ తో బాలయ్య బాబు కి మరింత సాన్నిహిత్యం పెరిగింది.
ఆ సాన్నిహిత్యం తోనే అల్లు అరవింద్ బాలయ్య బాబు ని పెట్టి త్వరలో ఒక సినిమా చెయ్యబోతున్నట్టు తెలుస్తుంది..ఇన్నేళ్ల గీత ఆర్ట్స్ సుదీర్ఘ ప్రస్థానం లో బాలయ్య బాబు తో ఒక్క సినిమా కూడా చెయ్యలేదు..కలలో కూడా ఊహించని వీళ్లిద్దరి కాంబినేషన్ సినిమా అతి త్వరలోనే తెరకెక్కబోతుంది అంటూ ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వార్త..ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించబోతున్నట్టు తెలుస్తుంది..పరశురామ్ పెట్ల రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు తో ‘సర్కారు వారి పాట’ సినిమా చేసాడు..ఆ చిత్రం మంచి హిట్ అయ్యింది..నిన్న జరిగిన అల్లు శిరీష్ కొత్త సినిమా ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధి గా బాలయ్య బాబు హాజరైన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ఈవెంట్ కి పరశురామ్ పెట్ల కూడా హాజరయ్యాడు.

ఆయన ప్రసంగిస్తున్న సమయంలోనే బాలయ్య బాబు తో త్వరలో ఒక సినిమా చెయ్యబోతున్నట్టు అధికారికంగా ప్రకటించాడు..ప్రస్తుతం ‘వీర సింహ రెడ్డి’ చిత్రం లో నటిస్తున్న బాలయ్య,ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి తో ఒక చిత్రం చేయనున్నాడు..ఈ సినిమాతో పాటుగా సమాంతరంగా పరశురామ్ పెట్ల మూవీ షూటింగ్ కూడా జరుగుతుందని తెలుస్తుంది.