Balakrishna and Nagababu : జనసేన జయకేతన వేదికగా నాగబాబు, పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. టీడీపీ అభిమానులు మెగా బ్రదర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్ పని చేశాయి. ఒకటి పవన్ కళ్యాణ్, రెండోది పిఠాపురం ప్రజలు, ఓటర్లు. అలా కాదు పవన్ కళ్యాణ్ మా వల్లే గెలిచాడు అనుకుంటే.. అది వారి ఖర్మ, అన్నారు. ఈ కామెంట్స్ పిఠాపురం టీడీపీ నేత వర్మను ఉద్దేశించి నాగబాబు అన్నారనే వాదన మొదలైంది.
Also Read : రెస్టారెంట్ కు వెళ్లిన బాలయ్యలో మరో యాంగిల్ ఇదీ.. చూస్తారా?
అలాగే పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో… మనం నిలబడటంతో పాటు 40 ఏళ్ల అనుభవం ఉన్న టీడీపీని నిలబెట్టాం, అన్నారు. టీడీపీ గెలవడానికి జనసేన కారణం అని పవన్ కళ్యాణ్, అన్నారంటూ టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ-జనసేన కార్యకర్తల మధ్య సోషల్ మీడియా వార్ నెలకొంది. మేము లేకపోతే మీరు లేరు.. అని పరసర్పం కామెంట్స్ చేసుకుంటున్నారు. పనిలో పనిగా ఈ వివాదానికి వైసీపీ సోషల్ మీడియాలో ఆజ్యం పోస్తుంది.
కాగా గతంలో బాలకృష్ణపై నాగబాబు చేసిన ఆరోపణలు, సెటైరికల్ వీడియోలు తెరపైకి వచ్చాయి. బాలకృష్ణ గతంలో చిరంజీవి రాజకీయ వైఫల్యం పై ఘాటైన విమర్శలు చేశాడు. రాజకీయాల్లో సక్సెస్ కావడం అందరి వల్లా కాదు. మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరని.. ఓ ఇంటర్వ్యూలో పరుష వ్యాఖ్యలు చేశాడు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండిస్తూ నాగబాబు వరుస వీడియోలు చేశాడు.
అలాగే ఓ ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు అన్నారు. యాంకర్.. బాలయ్య మీద మీ అభిప్రాయం ఏమిటనగా.. ఆయనెవరో నాకు తెలియదు అన్నాడు. క్షమించాలి.. బాలయ్య తెలియకపోవడం ఏమిటీ.. ఆయన సీనియర్ నటుడు. అద్భుతంగా నటిస్తాడు, అన్నారు. నేను అడుగుతుంది నందమూరి బాలకృష్ణ గురించి అనగా.. ఆయన ఎవరో తెలియదు క్షమించాలి, అన్నాడు. అప్పట్లో ఈ వీడియో సంచలనం రేపింది. తాజా పరిణామాల నేపథ్యంలో నాగబాబు పాత వీడియో తెరపైకి వచ్చింది.
ఇదిలా ఉంటే… నాగబాబు మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నాడు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా జనసేన పార్టీకి కేటాయించిన ఎమ్మెల్సీ పదవి నాగబాబుకు కేటాయించారు. ఈ మేరకు ఇటీవల ప్రకటన జరిగింది. పవన్ కళ్యాణ్, నాగబాబు మొదటిసారి అసెంబ్లీకి వెళ్లారు.
Also Read : మీమర్స్ కి ట్రోల్ స్టఫ్ ఇచ్చిన నాగబాబు..పవన్ కళ్యాణ్ పుట్టుక గురించి షాకింగ్ కామెంట్స్!