Iron Dome : ఐరన్ డోమ్ గురించి మనం అనేక సందర్భాల్లో పత్రికల్లో చదివి ఉంటాం. న్యూస్ ఛానల్స్ లో చెబుతుంటే వినే ఉంటాం. కానీ స్టీల్ డోమ్ గురించి మీరు ఎప్పుడైనా విని ఉన్నారా? లేదా పేపర్లలో చదివారా? లేదు అనే కదా మీ సమాధానం.. అయితే చదివేయండి ఈ కథనం.. స్టీల్ డోమ్ పేరులోనే స్టీల్ ఉంది.. అంటే ఇది కూడా ఒకరకంగా రక్షణ వ్యవస్థ లాంటిది.. దీనిని యాంత్రిక పరిభాషలో టర్బో వెంటిలేటర్ అని పిలుస్తుంటారు. స్టీల్ డోమ్ లో ఫ్యాన్లు ఉంటాయి. అయితే వీటిని కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదు.. అత్యంత ముఖ్యమైన పనులు చేయడానికి ఉపయోగిస్తారు. కర్మ గారాలలో, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో స్టీల్ డోమ్ లను నిర్మిస్తారు. వీటిని టర్బో వెంటిలేటర్లు లేదా ఎయిర్ వెంటిలేటర్, టర్బైన్ వెంటిలేటర్, రూప్ ఎక్స్ ట్రాక్టర్ అని పిలుస్తుంటారు. ఒకప్పుడు ఇవి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకు మాత్రమే పరిమితమయ్యేవి. ఇప్పుడు షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద దుకాణాలు, రైల్వే స్టేషన్లో కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్మిస్తున్న గోదాము పై భాగాలలో వీటిని ఏర్పాటు చేస్తోంది.
దీనివల్ల ఉపయోగం ఏంటంటే..
స్టీల్ డోమ్ లు ప్రాథమిక శాస్త్రీయ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి. వేడిగాలి, చల్లని గాలి కంటే అత్యంత తేలికగా ఉంటుంది. వేడిగాలి ఏదైనా ఒక స్థలాన్ని ఆక్రమించినప్పుడు.. అది త్వరగా వేడెక్కడానికి లేదా ఉష్ణోగ్రత పెరగడానికి కారణం అవుతుంది. గదులలో వేడి గాలి ఎక్కువగా ఉన్నప్పుడు స్టీల్ డోమ్ లు వాటిని బయటికి పంపించడానికి తోడ్పడతాయి. ఆ తర్వాత చల్లని గాలిని పీల్చుకొని లోపలికి పంపిస్తాయి. దీనివల్ల గదులు ఎప్పటికీ చల్లగా ఉంటాయి. వేడిగాలి బయటికి వెళ్ళేటప్పుడు స్టీల్ డోమ్ లోని ఫ్యాన్లు తిరుగుతుంటాయి. దానివల్ల గాలి నిరంతరం బయటికి వెళ్లి పోతూ ఉంటుంది. అదే సమయంలో చల్లగాలిని కూడా ఫ్యాన్లు కిందికి లాగుతూ ఉంటాయి.. దీనివల్ల గదులలో వాతావరణం ఎప్పటికీ చల్లగా ఉంటుంది. పెద్ద పెద్ద గదులు.. వ్యాపార సముదాయాలను చల్లపరచాలంటే భారీగా ఏసీలను వినియోగించాల్సి ఉంటుంది. దీనివల్ల ఎక్కువ మొత్తంలో విద్యుత్ అవసరం పడుతుంది. ఇలా కాకుండా కేవలం సంప్రదాయ విధానంలో స్టీల్ డోమ్ లు ఏర్పాటు చేస్తే అంతగా ఏసీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు. విద్యుత్ ను ఖర్చు పెట్టాల్సిన అగత్యం ఉండదు. పైగా గదులలో ఉన్న దుర్వాసనను స్టీల్ డోమ్ లు సులభంగా బయటికి పంపిస్తాయి. అంతేకాదు పెద్ద పెద్ద గోదాములలో నిలువ ఉంచిన ఆహార పదార్థాలు పాడుకాకుండా ఇవి తోడ్పడుతుంటాయి. మరోవైపు కార్మికులు కూడా సులభంగా పనిచేయడానికి.. మెరుగైన పని అనుభవాన్ని పొందడానికి స్టీల్ డోమ్ లు ఉపకరిస్తాయి. ఒకప్పుడు పెద్ద పెద్ద కర్మ గారాలలో మాత్రమే వీటిని ఉపయోగించేవారు. ఇప్పుడు షాపింగ్ మాల్స్, ఇతర భారీ నిర్మాణాలలో వీటిని ఉపయోగిస్తున్నారు. అందువల్లే ఇప్పుడు స్టీల్ డోమ్ అనేది ట్రెండింగ్ లో ఉంది. మరోవైపు కేంద్రం కూడా స్టీల్ డోమ్ ల ఏర్పాటుపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది. వీటిని ఏర్పాటు చేసుకునే కంపెనీలకు రాయితీలు కూడా ఇస్తున్నది.
Also Read : ఇరాన్ దాడులను అడ్డుకున్న ఇజ్రాయిల్ తెగువపై కేంద్రానికి ఆనంద్ మహీంద్రా కీలక సూచన