Homeఎంటర్టైన్మెంట్Balakrishna Movie Shoot In Chiranjeevi House: చిరంజీవి ఇంట్లో షూటింగ్ జరుపుకున్న బాలయ్య...

Balakrishna Movie Shoot In Chiranjeevi House: చిరంజీవి ఇంట్లో షూటింగ్ జరుపుకున్న బాలయ్య బాబు బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా?

Balakrishna Movie Shoot In Chiranjeevi House: మన టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ మధ్య ఎలాంటి బాక్స్ ఆఫీస్ పోటీ ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఇండస్ట్రీ లో ఒక్కప్పుడు టాప్ 2 హీరోలు వీళ్ళే..బాక్స్ ఆఫీస్ వద్ద వీళ్లిద్దరి మధ్య ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా..వ్యక్తిగతంగా ఇద్దరు మంచి స్నేహితులు అనే విషయం మన అందరికి తెలిసిందే..

Chiranjeevi House
Chiranjeevi, Balakrishna

ఒకరినొక్కరు సోదరులుగా భావించుకునే ఈ ఇద్దరి మధ్య జరిగిన ఒక్క సంఘటన వీళ్ళ మధ్య ఎలాంటి అనుబంధం ఉండేదో చెప్పడానికి ఉదాహరణగా నిలిచింది..అదేమిటి అంటే 1990 వ సంవత్సరం లో నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన నారి నారి నడుమ మురారి అనే సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..

Nari Nari Naduma Murari

మాస్ ఇమేజి ఉన్న బాలయ్య లాంటి స్టార్ ఒక్క ఫైట్ కూడా లేకుండా ఈ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టడం విశేషం..ఇది పక్కన పెడితే ఈ సినిమాలో కనిపించే ఇల్లు మరెవరిదో కాదు.. అది స్వయానా మెగాస్టార్ చిరంజీవి గారి గెస్ట్ హౌస్ అట..చెన్నై లోని వెలచేరి ప్రాంతం లో మెగాస్టార్ చిరంజీవి కి ఒక్క గెస్ట్ హౌస్ ఉంది..అక్కడ ఈ సినిమా షూటింగ్ చేసుకోవడానికి చిరంజీవి ని కోరగా ఆయన వెంటనే అంగీకరించాడు అట..అంతే కాకుండా ఈ గెస్ట్ హౌస్ పక్కనే చిరంజీవి కి 2 ఎక‌రాల స్థ‌లం కూడా ఉంది..

Also Read: Vishwak Sen Car: విశ్వక్ సేన్ కారు వైరల్.. ఇంతకీ ధర ఎంతో తెలుసా ?

ఈ సినిమాలో హీరో బాల‌య్య పాత్ర పూరి గుడిసె లో ఉండే సన్నివేశాలు ఈ స్థ‌లంలోనే నిర్మించారు..తన సోదరసమానుడు అయినా నందమూరి బాలకృష్ణ సినిమా కావడం, అంతే కాకుండా ఈ చిత్ర దర్శకుడు కోదండ రామి రెడ్డి చిరంజీవి కి ఎంతో సన్నిహితుడు అవ్వడం వల్ల ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తన ఇంటిని షూటింగ్ కోసం వాడుకునేందుకు అనుమతిని ఇచ్చాడు అట చిరంజీవి..ఈ చిత్ర దర్శకుడు కోదండ రామి రెడ్డి మెగాస్టార్ చిరంజీవి తో ఏకంగా 23 సూపర్ హిట్ సినిమాలు తీసిన సంగతి మన అందరికి తెలిసిందే..దాని వల్ల వీళిద్దరి మధ్య ఎంతో సన్నిహిత్య సంబంధం ఏర్పడింది..ఆ చనువు తోనే చిరంజీవిని షూటింగ్ కోసం ఇల్లు ని అడిగారు కోదండ రామి రెడ్డి గారు..అలా చిరంజీవి మరియు బాలయ్య మధ్య జరిగిన ఈ చిన్న సంఘటన చాలా కాలం తర్వాత సోషల్ మీడియా లో వెలుగులోకి వచ్చి వైరల్ గా మారింది.

Also Read: Sudigali Sudheer Birthday: హ్యాపీ బర్త్ డే సుధీర్.. ఇలాగే దూసుకు వెళ్లిపో.. పెద్ద హీరోవైపో
Recommended Videos
జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ కి కారణం ఇదే | Jr NTR 39th Birthday Special Video | Oktelugu Entertainment
మళ్లీ ఒక్కటైన షణ్ముక్, దీప్తి సునైనా..? || Deepthi Sunaina And Shanmukh Jaswanth Relationship
డెడ్ చీప్ అయిపోయిన హీరో || Tollywood Young Hero Remuneration || Oktelugu Entertainment

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version