Balayya Koratala Shiva Film: మాస్ కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరుగా మారిన దర్శకుడు కొరటాల శివ… ఆయన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఏదో ఒక మెసేజ్ అయితే ఉంటుంది. గత రెండు సినిమాల నుంచి ఆయన కొంతవరకు నిరాశపరిచినప్పటికి అంతకుముందు మాత్రం స్టార్ హీరోలందరితో వరుస సక్సెస్ లను సాధించిన దర్శకుడిగా గొప్ప పేరు ప్రఖ్యాతాలను సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు బాలయ్య బాబుతో చేస్తున్న సినిమా విషయంలో కూడా చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఈరోజు పూజా కార్యక్రమాలను జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన కథేంటి అనే దానిమీదనే విపరీతమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ సినిమా కథ కె.జి.ఎఫ్ ను మించి ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. కేజిఎఫ్ లో ఎలాగైతే మదర్ సెంటిమెంట్ ని బేస్ చేసుకుని సినిమా మొత్తాన్ని ముందుకు తీసుకెళ్లారో ఈ సినిమాలో కూడా మదర్ సెంటిమెంట్ ని ఆసరాగా చేసుకొని సినిమాని ముందుకు తీసుకెళ్తున్నారు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా కనక భారీ విజయాన్ని సాధిస్తే మాత్రం బాలయ్య బాబు క్రేజ్ అమాంతం తరా స్థాయికి వెళ్ళిపోతుంది. ఇక కొరటాల శివ సైతం టాప్ డైరెక్టర్ గా మారిపోతాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ మూవీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మొదటి సినిమా కావడం వల్ల ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలైతే నెలకొన్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా కొరటాల శివ బాలయ్య బాబుని ఒక సింహంలా చూపించబోతున్నాడు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. కేజీఎఫ్ తరహాలోనే ఈ సినిమాలో కూడా భారీ ఎలివేషన్స్ ఉంటాయట. మదర్ సెంటిమెంట్ ని బేస్ చేసుకుని బాలయ్య బాబు వచ్చిన ప్రతిసారి సక్సెస్ ని సాధించాడు అంటూ తన అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు మదర్, సిస్టర్ సెంటిమెంట్స్ తో వచ్చిన ప్రతిసారి మంచి విజయాన్ని సాధిస్తున్నాడు. అలాగే బాలయ్య బాబు అలాంటి ఎమోషన్స్ అన్నింటిలో కూడా బాగా నటిస్తాడు అనే ఒక పేరు అయితే ఉంది. కాబట్టి ఈ సినిమాలో మరోసారి అదే రిపీట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది…
