Balakrishna- Ram Pothineni: బాలకృష్ణ చేతివాటం గురించి తెలిసిందే. కోపం వస్తే వెంటనే తీర్చేసుకుంటాడు. ఆయన పక్కన ఉన్నప్పుడు ఎదుటివారి మాటలు చేష్టలు సక్రమంగా ఉండాలి. తగు దూరం మైంటైన్ చేయాలి. లేదంటే పుర చేయితో మూడిందే. బహు సందర్భాల్లో బాలయ్య తన అభిమానులపై చేయి చేసుకున్నాడు. కొందరినైతే ఉరిమి ఉరిమి చూశాడు. బాలయ్య పబ్లిక్ లో జనాల్ని కొట్టడం వివాదాస్పదమైంది. అయితే ఆయన మారలేదు. పైగా నేను కొడితే అభిమానులు దాన్ని అదృష్టంగా భావిస్తారని సమర్ధించుకున్నారు.
తాజాగా హీరో రామ్ ఆయన ఆగ్రహానికి గురయ్యాడు. స్మాల్ వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు. సెప్టెంబర్ 15న స్కంద మూవీ విడుదల కానుంది. ఈ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను కావడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా బాలకృష్ణ హాజరయ్యారు. వేదికపై హీరో రామ్ పోతినేని మాట్లాడారు. ఫ్లోలో రామ్ బాలయ్యను ఈయన్ని అనేశాడు. బాలయ్య వెంటనే స్పందించాడు. గెస్ట్ గా పిలిచి ఈయన, ఆయన అని ఏదో మామూలు వ్యక్తిని సంబోధించినట్లు సంబోధించడం బాలయ్యకు కోపం తెప్పించింది.
రామ్ ని దగ్గరకు పిలిచి.. మైక్ లోనే వార్నింగ్ ఇచ్చేశాడు. నాకు అన్నీ వినిపిస్తాయి. కానీ నేను వినకూడనివి విన పడితే మాత్రం అన్నాడు. ”మెదడు రెండు చెవుల మధ్య ఎందుకు ఉంటుందో తెలుసా” అని హిందీలో భగవంత్ కేసరీ డైలాగ్ చెబుతూ రామ్ కి వార్నింగ్ ఇచ్చేశాడు. ఈయన్ని, ఆయన్ని అంటే బాగోదని చెప్పకనే చెప్పేశాడు. మర్యాదల విషయంలో బాలకృష్ణ చాలా పర్టిక్యులర్. ఏమాత్రం తనకు గౌరవం తగ్గిందనుకున్నా వెంటనే స్పందిస్తాడు.
ఆ వీడియో వైరల్ కాగా రామ్ తృటిలో తప్పుకున్నాడు. పబ్లిక్ ఈవెంట్ కావడంతో బ్రతికిపోయాడు. లేదంటే జరగకూడనిది జరిగేదని కామెంట్స్ చేస్తున్నారు. ఒక స్కంద చిత్రం పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఇటీవల ట్రైలర్ విడుదల కాగా ఆదరణ దక్కించుకుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు.