https://oktelugu.com/

Balakrishna And Ravi Teja: రవితేజను బాలయ్య కొట్టాడా? అన్ స్టాపబుల్ షోలో ఇద్దరూ కూర్చోవడానికి ముందు ఏం జరిగిందంటే?

రవితేజ-బాలకృష్ణ మధ్య విబేధాలు ఉన్నాయనే వాదన చాలా కాలంగా పరిశ్రమలో ఉంది. ఓ హీరోయిన్ విషయమై ఇద్దరూ గొడవపడ్డారట. రవితేజను బాలయ్య కొట్టారనే పుకార్లు చక్కర్లు కొట్టాయి. అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న బాలకృష్ణ, రవితేజ దీనిపై క్లారిటీ ఇచ్చారు. అయితే వారు నిజం చెప్పారని మనం నమ్మలేం. రవితేజకు అత్యంత సన్నిహితుడైన రచయిత, దర్శకుడు బివిఎస్ రవి దీనిపై క్లారిటీ ఇచ్చారు.

Written By:
  • S Reddy
  • , Updated On : October 28, 2024 / 10:10 AM IST

    Balakrishna And Ravi Teja

    Follow us on

    Balakrishna And Ravi Teja: హీరోల మధ్య మనస్పర్థలు, విబేధాలు సాధారణమే. అందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే ఎదురుపడితే చక్కగా మాట్లాడుకుంటారు. మనసులో ఏమున్నప్పటికీ అది బయటకు ప్రదర్శించరు. కారణం మీడియా వాచ్ చేస్తూ ఉంటుంది. ఏమాత్రం తమ అసహనం బయటపెట్టిన అదో పెద్ద కాంట్రవర్సీ, న్యూస్ అవుతుంది. కాగా రవితేజకు బాలయ్యకు విబేధాలు ఉన్నాయనే వాదన పరిశ్రమలో గట్టిగా వినిపించింది. రవితేజను బాలయ్య కొట్టాడట. ఇది రవితేజ హీరోగా ఎదుగుతున్న రోజుల్లో జరిగిందట.

    బాలయ్య హోస్ట్ గా ఉన్న అన్ స్టాపబుల్ షోకి రవితేజ గెస్ట్ గా వచ్చాడు. ఈ షో వేదికగా మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. అవన్నీ పుకార్లు మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. కాగా అన్ స్టాపబుల్ షోకి డైరెక్టర్ గా ఉన్న బివిఎస్ రవిని ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న అడగ్గా… ఆయన కీలక విషయాలు వెల్లడించాడు. రవితేజతో నాకు 20 ఏళ్ల అనుబంధం ఉంది. ప్రతి రెండు రోజులకు ఫోన్ చేసి మాట్లాడే చనువు ఉంది. నాకే వారి గొడవ విషయం తెలియలేదంటే ఇది అబద్ధం.

    వజ్రోత్సవ వేడుకల్లో బాలకృష్ణ, రవితేజ కలిశారు మాట్లాడుకున్నారు. అలాగే ఒకసారి షూటింగ్ కోసం ఇద్దరూ యూరప్ వెళుతున్నారు. ఫ్లైట్ లో అనుకోకుండా కలిశారు, మాట్లాడుకున్నారు. చిరంజీవి 60వ బర్త్ డే వేడుకల్లో రవితేజ, బాలకృష్ణ పాల్గొన్నారు. బాలకృష్ణ డాన్స్ చేశారు. వారిద్దరి మధ్య మామూలు జోకులు పేలలేదు. మనస్పర్థలు ఉంటే ఇలా కలిసిపోరు కదా.

    అన్ స్టాపబుల్ షోకి గెస్ట్ గా రవితేజను అనుకుంటున్నాం.. అంటే బాలయ్య, పిలవండి అన్నారు. ఇదే విషయం రవితేజకు చెబితే బాలయ్య పిలిస్తే రాకుండా ఎలా ఉంటాను. కాకపోతే టైట్ షెడ్యూల్స్. డేట్ ఎప్పుడనేది నేను చెబుతాను. ఆ వెసులుబాటు నాకు ఇవ్వండని రవితేజ అన్నారు. రవితేజ స్టూడియోలోకి రాగానే హాయ్ రవితేజ గారు.. అని బాలకృష్ణ పలకరించారు. రవితేజ గారేంటండి… రవి అనండి చాలు. మీరు సీనియర్ హీరో అని రవితేజ అన్నారు.

    కాబట్టి రవితేజతో బాలయ్యకు గొడవలు అనేది పుకారు మాత్రమే. అందులో నిజం లేదు. అన్ స్టాపబుల్ షో ఎపిసోడ్ షూటింగ్ ముగిశాక కలిసి భోజనం కూడా చేశారని… బీవీఎస్ రవి చెప్పుకొచ్చాడు.