Balakrishna- Gopichand Malineni: క్రాక్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేనికి బాలయ్య పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. ఆయన టేకింగ్, మాస్ ఎలివేషన్స్ కి పడిపోయిన బాలయ్య… మన ఇమేజ్ కి గోపీచంద్ లాంటి డైరెక్టర్ కరెక్ట్ అని నమ్మి సినిమా షురూ చేశారు. వీరి కాంబినేషన్ లో సినిమా సెట్ అయ్యాక గోపీచంద్ కథ సిద్ధం చేశారు. కొంత రీ సెర్చ్ చేసి… బాలయ్య కోసం అవుట్ అండ్ అవుట్ మాస్ స్క్రిప్ట్ రాసుకొచ్చారు. సెట్స్ పై ఉన్న ఈ ప్రాజెక్ట్ చకచకా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక బాలయ్య బర్త్ డే పురస్కరించుకుని నిన్న టీజర్ విడుదల చేశారు. బాలకృష్ణ 107వ చిత్ర టీజర్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అఖండ చిత్రానికి చాలా దగ్గరగా అనిపించింది.

బాలయ్య లుక్, మేనరిజం అఖండ చిత్రాన్ని గుర్తు చేశాయి. అఖండ లో బాలయ్య తెల్ల పంచె, చొక్కా ధరిస్తే… గోపీచంద్ చిత్రంలో నలుపు రంగు చొక్కా, బూడిద రంగు లుంగీ వేసుకున్నాడు. ఇక ‘మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్ నా జీవో గాడ్స్ ఆర్డర్’ అంటూ చెప్పడం, ఒక షాట్ లో మైనింగ్ ఏరియా చూపించడం చూస్తే… ఇది కూడా పర్యావరణం, మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా తెరకెక్కుతున్న సినిమాలానే ఉంది. అఖండ మూల కథ కూడా పర్యావరణ పరిరక్షణ కావడం గమనించదగ్గ విషయం.
Also Read: Hyper Aadi: యాంకర్ వర్షిణితో ప్రేమలో హైపర్ ఆది.. సంచలన విషయాలు వెలుగులోకి
బాలయ్య చెప్పిన మరో రెండు డైలాగ్స్… లెజెండ్, సింహా చిత్రాలను గుర్తు చేశాయి. మొత్తంగా బాలయ్య హిట్ చిత్రాలను మిక్స్ చేసి సరికొత్తగా ఓ స్క్రిప్ట్ సిద్ధం చేసుకొని గోపీచంద్ మలినేని మూవీ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. అసలు ఏమాత్రం కొత్తదనం లేకుండా టీజర్ సాగింది. అదే బాలయ్య డైలాగ్స్, అదే ఫైటింగ్స్, అదే మేనరిజం. దానికి తోడు బాలయ్యకు ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. ఒక హిట్ ఇస్తే వరుసగా నాలుగైదు ప్లాప్స్ ఇస్తారు.

2014లో విడుదలైన లెజెండ్ తర్వాత ఆయనకు క్లీన్ కమర్షియల్ హిట్ దక్కలేదు. మళ్ళీ 8 ఏళ్ల తర్వాత అఖండం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ సెంటిమెంట్ ప్రకారం గోపీచంద్ మూవీకి గడ్డుకాలమే. కాబట్టి గోపీచంద్ మలినేని చాలా జాగ్రత్తగా.. తన టాలెంట్ మొత్తం ఉపయోగించి జనరంజకంగా మూవీ తీర్చిదిద్దాలి. ఆషామాషీగా ఆరు ఫైట్లు, ఆరు సాంగ్స్ ఫార్మాట్లో తీసి వదిలితే.. బాలయ్యకు మరో ప్లాప్ పడడం ఖాయం. అదే జరిగితే గోపి చంద్ కెరీర్ మళ్ళీ నెమ్మదిస్తుంది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక బాలకృష్ణ 108వ చిత్రం దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించనున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్ సైతం సెట్స్ పైకి వెళ్లనుంది.
Also Read:Prabhas Marriage: శ్రావణమాసంలో ప్రభాస్ పెళ్లి… అమ్మాయి ఎవరంటే?
[…] […]