Allu Arjun And Balakrishna: నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘గద్దర్ అవార్డ్స్'(Gaddar Awards) ఈవెంట్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అట్టహాసం గా జరిపించిన తీరుపై టాలీవుడ్ సినీ ప్రముఖులు మెచ్చుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం తరుపున ఇప్పటి వరకు ఎలాంటి అవార్డ్స్ ఈవెంట్స్ ని ఏర్పాటు చేయలేదు. తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పుడు ‘నంది అవార్డ్స్’ ని ఇచ్చేవారు. దీనిని 2014 వ సంవత్సరం లో రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొనసాగించింది కానీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం కొనసాగించలేదు. పదేళ్ల తర్వాత ఇన్నాళ్లకు ప్రభుత్వం తరుపున నటీనటులకు గౌరవం ఇవ్వడం పట్ల సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి ప్రశంసల వర్షం కురుస్తుంది. ఈ అవార్డ్స్ కి తన పాటలతో తెలంగాణాలో విప్లవ జ్వాలలు రగిలించి ప్రతీ ఒక్కరిలో చైతన్యం నింపేలా చేసిన గద్దర్ పేరు పెట్టడం కూడా గొప్ప నిర్ణయం గా భావించవచ్చు.
ఈ ఈవెంట్ హైలైట్స్ ని ఒకసారి గమనిస్తే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మన తెలుగు సినిమా ఖ్యాతి గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ, హాలీవుడ్,బాలీవుడ్ మన హైదరాబాద్ కి రావాలి, ఆ స్థాయికి ఎదగడానికి మీకు ఏమి కావాలో చెప్పండి,నేను చేసి పెడతాను అంటూ చెప్పడం బాగా హైలైట్ అయ్యింది. అదే విధంగా ఈ ఈవెంట్ కి అల్లు అర్జున్(Icon Star Allu Arjun), నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీళ్లిద్దరు పక్కపక్కనే కూర్చున్నారు. కాసేపు సరదాగా సంభాషణలు కూడా జరిపారు. వేదిక పై ఒక ఎనర్జిటిక్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ జరుగుతున్న సమయంలో బాలయ్య అల్లు అర్జున్ తో మాట్లాడుతూ ‘పదా మనం కూడా వెళ్లి డ్యాన్స్ వేద్దాం’ అని అడుగుతాడు. అప్పుడు అల్లు అర్జున్ ‘ఆమ్మో..నా వల్ల కాదు’ అంటూ సైగలు చేయడం బాగా హైలైట్ అయ్యింది. సోషల్ మీడియా లో ఈ వీడియో ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది.
ఇంకా ఈ ఈవెంట్ లో హైలైట్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే వెన్నెల కిషోర్, సత్య కాంబినేషన్ లో వేదిక పై జరిగిన ఒక కామెడీ సంభాషణ సీఎం రేవంత్ రెడ్డి ని సైతం నవ్వించేలా చేసింది. అదే విధంగా అల్లు అర్జున్ , బాలకృష్ణ,విజయ్ దేవరకొండ, దిల్ రాజు వంటి ప్రముఖుల ఉపన్యాసాలు కూడా హైలైట్ అయ్యాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ ప్రసంగం చివర్లో సీఎం రేవంత్ రెడ్డి ని పక్కనే ఉంచుకొని పుష్ప 2 లోని డైలాగ్ పలకడం సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది. దీనిపై అల్లు అర్జున్ అభిమానులే కాదు,ఇతర హీరోల అభిమానులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతే కాకుండా దీనిపై సోషల్ మీడియా లో కొన్ని ట్రోల్స్ కూడా నడుస్తున్నాయి. ఇలా ఎన్నో విశేషాలతో ఈ ఈవెంట్ అందంగా ముగిసింది.
బాలయ్య: బన్నీ స్టెప్పేద్దామా?
బన్నీ: నా వల్ల కాదు.. మీరెళ్లండి!!
బాలయ్య: రా.. ఫర్లేదు#GaddarAwards pic.twitter.com/0UfsKYXGwM— Telugu360 (@Telugu360) June 14, 2025