Raventh Reddy Speetch Gaddar Awards: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అద్వర్యం లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిన్న సాయంత్రం నిర్వహించిన ‘గద్దర్ అవార్డ్స్'(Gaddar Awards) వేడుకకు జనాల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్(Icon Star Allu Arjun), నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రసంగాలు బాగా హైలైట్ అయ్యాయి. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే 65 ఏళ్ళ వయస్సు ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ, 55 ఏళ్ళ వయస్సు ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ని అన్నా అని సంభోదించాడు అందరినీ షాక్ కి గురి చేసింది. అల్లు అర్జున్ కూడా అన్న అని సంభోదించాడు. ఆయన అలా పిలవడం లో ఎలాంటి వింత లేదు కానీ, బాలయ్య అన్నా అని పిలవడమే ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. అయితే రేవంత్ రెడ్డి ఈ ఈవెంట్ లో నేటి తరం స్టార్ హీరోలందరి పేర్లను ప్రస్తావించకపోవడం తో సోషల్ మీడియా లో ఆ హీరోల అభిమానులు ఫీల్ అవుతున్నారు.
Person akkada lekunna ah name vasthune untundi
“PAWAN KALYAN”❤️
pic.twitter.com/D6O4aeh7g0— కొమరం పులి (@SingleMan122) June 14, 2025
మొదటి తరానికి ఎన్టీఆర్, ఏఎన్నార్..రెండవ తరానికి కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు మరియు మూడవ తరానికి చిరంజీవి,బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి వారు ప్రాతినిధ్యం వహించారని, నాల్గవ తరానికి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), మహేష్ బాబు(Super Star Mahesh Babu), అల్లు అర్జున్ వంటి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పుకొచ్చాడు. నేటి తరం స్టార్ హీరోల లిస్ట్ తీస్తే మొత్తం ఆరు మంది ఉంటారు. అందులో పాన్ ఇండియా వైడ్ లో తమ మార్కెట్ ని విస్తరింపచేసుకున్న రామ్ చరణ్(Global Star Ram Charan), ప్రభాస్(Rebel Star Prabhas),ఎన్టీఆర్(Junior NTR) వంటి పాన్ ఇండియన్ హీరోల పేర్లను మర్చిపోవడం ఏమిటని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. మూడవ తరానికి చెందిన నలుగురు హీరోల పేర్లని మర్చిపోకుండా ప్రస్తావించిన సీఎం గారు, నాల్గవ తరం లో ఉన్న ఆరు మంది హీరోల పేర్లను ప్రస్తావించడానికి వచ్చిన సమస్య ఏమిటి అంటూ నిలదీస్తున్నారు. మరోపక్క ఆ హీరోలను అసలు స్టార్స్ గానే పరిగణించడం లేదంటూ ఆయన హీరోలకు సంబంధించిన దురాభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తూ వెక్కిరిస్తున్నారు.
ICON STAR SPEECH AT GADDAR AWARDS#FirstGaddarAwardForAApic.twitter.com/Wlv67WdVD9
— UNANIMOUS️♂️ (@Unanimous_A_A) June 14, 2025
అయితే ఉన్న హడావుడిలో సీఎం రేవంత్ రెడ్డి ఆ పేర్లను మర్చిపోయి ఉండొచ్చు కానీ, కావాలని ఉద్దేశపూర్వకంగా మర్చిపోలేదని మరికొందరు అంటున్నారు. ఈమధ్య రాజకీయ నాయకులు సినిమాలు చూడడం బాగా తగ్గించారని, అందువల్ల వాళ్లకు గుర్తు ఉన్న పేర్లను మాత్రమే ప్రస్తావిస్తున్నారని, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి వారు ఎంత కాదు అనుకున్న యూత్ ఆడియన్స్ ని విపరీతంగా ప్రభావితం చేసిన వారు కాబట్టి, వీళ్ళ సినిమాలు అప్పట్లో రాజకీయ నాయకులు సైతం చూసేవారు కాబట్టి వాళ్ళ పేర్లు పెద్ద స్టార్స్ గా మైండ్ లో రిజిస్టర్ అయిపోయి ఉంటుందని, ఇక నిన్న గద్దర్ అవార్డ్స్ ఈవెంట్ కి వచ్చి అల్లు అర్జున్ అవార్డు అందుకున్నాడు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి కి ఆయన పేరు కూడా కంఠస్తం అయ్యిందని, లేకపోతే కేవలం పవన్ కళ్యాణ్, మహేష్ బాబు పేర్లను మాత్రమే చెప్పేవాడని అంటున్నారు.