Balakrishna Worst Movies :నందమూరి నటసింహం గా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నటుడు బాలయ్య బాబు…సినిమా ఇండస్ట్రీ లో పెను ప్రభంజనాన్ని సృష్టిస్తున్న ఆయన వరుసగా 5 సినిమాలతో ఇండస్ట్రీ ని షేక్ చేశాడు. బాలయ్య బాబు ఇదే స్పీడ్ లో కనుక దూసుకుపోతే ఆయనకు మరిన్ని సక్సెస్ లు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి… బాలయ్య బాబు కెరీర్ మొదట్లో మాస్ హీరోగా అవతరించిన విషయం మనకు తెలిసిందే. ఆయన కెరియర్లో ఎన్ని సక్సెస్ ఫుల్ సినిమాలు ఉన్నాయో అంతకుమించిన ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక కొన్ని మాత్రం అల్ట్రా డిజాస్టర్ గా నిలవడం బాలయ్య బాబు కెరియర్ ను చాలా వరకు ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి… అందులో వీరభద్ర, విజయేంద్ర వర్మ, ఒక్క మగాడు, పరమవీరచక్ర లాంటి సినిమాలు అతనికి అల్ట్రా డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ సినిమాల వల్ల బాలయ్య బాబు గ్రాఫ్ కొంతవరకు తగ్గిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాలు బాలయ్యకి కూడా నచ్చలేదట…
ఒకానొక సమయంలో తన కెరియర్ అయిపోయింది అనే మాటలు కూడా వినిపించాయి. కానీ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేసిన ‘ సింహా’ సినిమాతో ఆయన మరోసారి బాక్సాఫీస్ లెక్కలను మార్చేశాడు. మొత్తానికైతే బాలయ్య ఎంటైర్ కెరీర్ లో చేసిన సినిమాలన్నింటిలో తన వంతు పాత్రనైతే పోషించాడు.
డిఫరెంట్ పాత్రలను చేయడానికి కూడా తను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని ప్రూవ్ చేశాడు. శ్రీరామరాజ్యం, పాండురంగడు లాంటి సినిమాల్లో పౌరాణిక పాత్రలను పోషించి ప్రేక్షకులను అలరించాడు. ఆయన చేస్తున్న ప్రతి సినిమా ప్రేక్షకులందరికి ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశ్యంతోనే పలు విభిన్న పాత్రలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కమర్షియల్ ధోరణిలోనే సినిమాలను చేస్తూ తన ఏజ్ కు తగ్గ పాత్రలను కూడా చేస్తున్నాడు.
అందుకే బాలయ్య బాబు ఈ మధ్యకాలంలో వరుస సక్సెస్ లను సాధిస్తున్నాడు. సీనియర్ హీరోలేవరికి లేనటువంటి గొప్ప రికార్డును కూడా తన ఖాతాలో వేసుకోవడం విశేషం… ఇప్పటివరకు ఏ సీనియర్ హీరో కూడా వరుసగా 5 విజయాలనైతే సాధించలేదు. అది బాలయ్య బాబుకు మాత్రమే సాధ్యమైందని పలువురు సినిమా పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తుండటం విశేషం…