Balakrishna- Advertisement: ఏడాది కాలంగా బాలయ్య జీవితంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో ఎన్నడూ నెరవేర్చని కొత్త బాధ్యతలు బాలయ్య తీసుకున్నారు. సరికొత్తగా ప్రేక్షకుల ముందు తనని తాను ఆవిష్కరించుకున్నారు. ఆయన టైం సూపర్ గా ఉంది. సరైన హిట్ లేక ఏళ్ల తరబడి ఎదురు చూశారు. అఖండ మూవీతో ఆ కోరిక తీరింది. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న అఖండ అనూహ్యంగా బాక్సాఫీస్ వద్ద పుంజుకుంది. లాక్ డౌన్ తో వెలవెలబోయిన థియేటర్స్ కి కళ తీసుకొచ్చింది అఖండ. ట్రాకర్లు, బండ్లు కట్టుకొని ప్రేక్షకులు అఖండ థియేటర్స్ కి వెళ్లారు.

అపూర్వ విజయం అఖండ హిట్ తో బాలయ్యకు దక్కింది. ఇక హోస్ట్ గా బాలయ్య చేస్తున్న సంచలనాలు అమోఘం. అన్ స్టాపబుల్ షోతో బాలయ్య నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు. బాలయ్య హోస్ట్ అనగానే పెదవి విరిచిన వాళ్ళకు చెంపపెట్టులా సక్సెస్ అయి చూపించారు. ఫస్ట్ సీజన్ బ్లాక్ బస్టర్ సక్సెస్ నేపథ్యంలో సెకండ్ సీజన్ కూడా మొదలైంది. నటుడిగానే కాదు వ్యాఖ్యాతగా కూడా రాణించగలరని బాలయ్య నిరూపించాడు.
బాలయ్య ఎత్తిన మరో అవతారం… బ్రాండ్ అంబాసిడర్. దాదాపు నలభై ఏళ్ల కెరీర్లో బాలకృష్ణ ఒక్క యాడ్ లో నటించలేదు. ఎలాంటి ఉత్పత్తులను ప్రమోట్ చేయలేదు. ఆ రూల్ బ్రేక్ చేసిన బాలయ్య సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్ ప్రచార కర్తగా మారారు. ఆ సంస్థ తరపున ప్రచారం చేస్తున్నారు. సాయి పల్లవి గ్రూప్ కి సంబంధించిన యాడ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఒక్క కమర్షియల్ యాడ్ లో కూడా నటించని హీరోగా బాలయ్యకు స్పెషల్ ఐడెంటిటీ ఉండేది. తాజాగా బాలయ్య అది కోల్పోయాడు.

మరోవైపు వీరసింహారెడ్డి మూవీతో సంక్రాంతి సమరానికి సిద్ధం అవుతున్నాడు. దర్శకుడు గోపీచంద్ మలినేని అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిస్తున్నారు. ఇక వీరసింహారెడ్డి టైటిల్ తో పాటు ప్రోమోలు అంచనాలు పెంచేశాయి. పెద్ద పండుగకు సిల్వర్ స్క్రీన్ పై బాలయ్య వీర విహారం చేయడం ఖాయంగా కనిపిస్తుంది. వీరసింహారెడ్డి మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.