https://oktelugu.com/

అరె.. ఒక్క ప్లాప్ కే తత్త్వం బోధపడిందే !

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, రామ్ చరణ్ తో చేసిన ‘వినయ విధేయ రామ’ చిత్రం ప్లాప్ తరువాత బాలయ్యతో సినిమా సెట్ చేసుకోవడానికి చాల గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే ‘వినయ విధేయ రామ’ ప్లాప్ అవ్వడానికి ప్రధాన కారణం సినిమాలో యాక్షన్ అండ్ ఎమోషన్ సీన్స్ వాస్తవానికి మరి దూరంగా ఉండటమేనని.. అందుకే బోయపాటి, నందమూరి బాలకృష్ణతో చేయబోయే సినిమాలో యాక్షన్ ను కాస్త నమ్మే విధంగా రియలిస్టిక్ గా తీయాలని బోయపాటి ఫిక్స్ […]

Written By:
  • admin
  • , Updated On : June 7, 2020 / 06:02 PM IST
    Follow us on


    మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, రామ్ చరణ్ తో చేసిన ‘వినయ విధేయ రామ’ చిత్రం ప్లాప్ తరువాత బాలయ్యతో సినిమా సెట్ చేసుకోవడానికి చాల గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే ‘వినయ విధేయ రామ’ ప్లాప్ అవ్వడానికి ప్రధాన కారణం సినిమాలో యాక్షన్ అండ్ ఎమోషన్ సీన్స్ వాస్తవానికి మరి దూరంగా ఉండటమేనని.. అందుకే బోయపాటి, నందమూరి బాలకృష్ణతో చేయబోయే సినిమాలో యాక్షన్ ను కాస్త నమ్మే విధంగా రియలిస్టిక్ గా తీయాలని బోయపాటి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

    ఇప్పటికే బోయపాటి బాలయ్య సినిమాకి సంబంధించి ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశాడు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారట. వారిలో ఒక హీరోయిన్ గా కన్నడ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్ ను తీసుకోవాలని దర్శక నిర్మతలు అనుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ చిత్రంలో ఎలాంటి రాజకీయ నేపథ్యం ఉండదట. కేవలం ఈ సినిమా ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో సాగే పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది.

    ఇంతకుముందు బాలయ్య – బోయపాటి కలయికలో వచ్చిన ‘సింహ, లెజెండ్’ చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. అలాగే ఈ సినిమా కూడా హిట్ అయితే, వీళ్ళు హ్యాట్రిక్ హిట్ కొట్టినట్లే. మరి ప్లాప్ ల్లో ఉన్న ఈ హిట్ కాంబినేషన్ ఈ సారి హిట్ కొడుతుందేమో చూడాలి. ఈ సినిమా తదుపరి షెడ్యుల్ రెగ్యులర్ షూటింగ్ ఆగష్టు నుండి మొదలవ్వనుంది.