రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ నేతల ఎదురుదాడి

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ శివారులోని జన్వాడలో అక్రమంగా ఫాంహౌజ్ నిర్మించారంటూ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి గతకొన్నిరోజులుగా పోరాడుతున్న సంగతి తెల్సిందే. ఇదే ఇష్యూలో రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు కూడా చేశారు. రేవంత్ రెడ్డి డ్రోన్ కెమెరాతో తమపై నిఘా పెట్టాడని టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేటీఆర్ తన ఫౌంహౌజ్ నిర్మాణం కోసం చెరువు పూడ్చివేసి […]

Written By: NARESH, Updated On : June 7, 2020 5:41 pm
Follow us on


టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ శివారులోని జన్వాడలో అక్రమంగా ఫాంహౌజ్ నిర్మించారంటూ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి గతకొన్నిరోజులుగా పోరాడుతున్న సంగతి తెల్సిందే. ఇదే ఇష్యూలో రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు కూడా చేశారు. రేవంత్ రెడ్డి డ్రోన్ కెమెరాతో తమపై నిఘా పెట్టాడని టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేటీఆర్ తన ఫౌంహౌజ్ నిర్మాణం కోసం చెరువు పూడ్చివేసి రోడ్డు వేసుకున్నారని ఆరోపిస్తూ రేవంత్ రెడ్డి హరిత ట్రిబ్యూనల్ ను ఆశ్రయించగా కోర్టు కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది.

ఈవిషయంపై కేటీఆర్ ట్వీటర్లో స్పందిస్తూ తనపై కావాలనే ప్రతిపక్ష నేతలు బురదచల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆయనకు మద్దతుగా ఎంఐఎం నేత అసరుద్దీన్ ఓవైసీ నిలిచారు. అయితే దీనిపై రెండు రోజులు టీఆర్ఎస్ నేతలు మౌనం వహించడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని గ్రహించారు. దీంతో ఆదివారం టీఆర్ఎస్ శాసన సభ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని టీఆర్ఎస్ నేతలు కర్నె ప్రభాకర్‌, బాల్క సుమన్ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై ఎదురుదాడికి దిగారు.

రేవంత్ రెడ్డి ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారన్నారు. అయినప్పటికీ పదేపదే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు దుష్పచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటంపై కాంగ్రెస్ నేతలు ఆలోచించుకోవాలని హితవు పలికారు. న్యాయస్థానాలపై తమకు గౌరవం ఉందని.. కేటీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శిస్తే సహించేది లేదన్నారు. రేవంత్‌ రెడ్డికి ఎన్నోసార్లు జైలుకు వెళ్లొచ్చిన చరిత్ర ఉందని గుర్తు చేశారు.

రేవంత్ రెడ్డికి ఎదుటివారిపై బురదజల్లడం అలవాటుగా మారిందన్నారు. 111 జీవో పరిధిలో ఎవరెవరికీ భూములున్నాయో తాము బయట పెడతామన్నారు. రేవంత్‌రెడ్డి చెబుతున్న భూములు కేటీఆర్‌వి కాదన్నారు. వట్టినాగులపల్లిలో రేవంత్‌ రెడ్డి బంధువుల పేరుపై అక్రమంగా భూములు ఉన్నాయంటూ ఆరోపించారు. ఓ పెయింటర్ స్థాయి నుంచి రేవంత్ రెడ్డి కోట్లాది ఆస్తులు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశమనని.. రేవంత్ ఐరన్ లెగ్ అంటూ టీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేశారు. ప్రజలకు నిజాలు చెప్పాలనే ఉద్దేశంతోనే మీడియా ముందుకొచ్చినట్లు టీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. అంతేతప్ప కేటీఆర్ పై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.