Homeఎంటర్టైన్మెంట్Balakrishna And NTR: బాలయ్య సినిమాను రీమేక్ చేయడానికి ప్రయత్నం చేసిన ఎన్టీఆర్...షాక్ ఇచ్చిన...

Balakrishna And NTR: బాలయ్య సినిమాను రీమేక్ చేయడానికి ప్రయత్నం చేసిన ఎన్టీఆర్…షాక్ ఇచ్చిన నటసింహం…

Balakrishna And NTR: నందమూరి నట సింహం బాలయ్య బాబు కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా డిఫరెంట్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నాడు. కెరియర్ స్టార్టింగ్ లో ‘భైరవద్వీపం’, ‘ఆదిత్య 369’ లాంటి డిఫరెంట్ సినిమాలైతే చేశాడు. ఈ రెండు సినిమాలు కూడా అతని కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇక కమర్షియల్ సినిమాల విషయానికి వస్తే ‘మంగమ్మగారి మనవడు’ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన బాలయ్య ఆ తర్వాత చేసిన పలు సినిమాలతో సైతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు… ఇక బాలయ్య తర్వాత నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న మరొక హీరో జూనియర్ ఎన్టీఆర్… ఈయన కెరియర్ స్టార్టింగ్ లో మాస్ సినిమాల వైపు అడుగులు వేశాడు. ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసే సినిమాలను చేశాడు. కానీ ఇప్పుడు తన స్టోరీ సెలెక్షన్ మారిపోయింది…డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకుంటూ కొత్త పంథా లో ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు బాలయ్య – జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధమైతే ఉండేది.

Also Read: హరీష్ శంకర్ డిస్ట్రిబ్యూటర్స్ కి డబ్బులు చెల్లించాల్సిందేనా…

కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళ మధ్య మాటలు లేవనే వార్తలైతే వస్తున్నాయి. ఎవరికి వారు సపరేట్ అయిపోయారు ఒకరి సినిమాల ప్రమోషన్స్ కి మరొకరు రావడం లేదు. ఒకరి ఇంట్లో ఫంక్షన్స్ కి సైతం మరొకరు అటెండ్ అవ్వడం లేదు. ఇలా ఎందుకని వ్యవహరిస్తున్నారు అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా వాళ్ల మధ్య భారీ వైరమైతే ఉంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సైతం బాలయ్య చేసిన ‘భైరవద్వీపం’ సినిమా ని రీమేక్ చేయాలనే ప్రయత్నం చేశాడు. అయినప్పటికి బాలయ్య మాత్రం ఒప్పుకోలేదట. కారణం ఏంటి అంటే తన కొడుకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయన చేత ఆ సినిమాను రీమేక్ చేయించాలని అనుకున్నారట.

అప్పటికి బాలయ్య ఎన్టీఆర్ మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధం ఉంది. అయినప్పటికి బాలయ్య ఆ సినిమా రీమేక్ రైట్స్ ని జూనియర్ ఎన్టీఆర్ కి ఇవ్వకపోవడంతో ఎన్టీఆర్ కొంతవరకు అసహనాన్ని వ్యక్తం చేశాడనే వార్తలు కూడా వచ్చాయి… ఇక బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ కూడా ఇవ్వలేదు. ఆయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడు భైరవ ద్వీపం సినిమాను రీమేక్ చేసేది ఎప్పుడు అంటూ పలువురు సినిమా మేధావులు సైతం కామెంట్లు చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version