Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Electricity Charges Reduction: చంద్రబాబు నిర్ణయం భేష్

Chandrababu Electricity Charges Reduction: చంద్రబాబు నిర్ణయం భేష్

Chandrababu Electricity Charges Reduction: ప్రభుత్వంపై సానుకూలత కు చాలా రకాల కారణాలు ఉంటాయి. ప్రధానంగా ఉద్యోగులు సానుకూలంగా ఉంటేనే మరోసారి ఆ పార్టీ అధికారంలోకి రాగలదు. మరో కారణం విద్యుత్ చార్జీలు. నేరుగా సామాన్య మధ్యతరగతి ప్రజలపై ప్రభావం చూపేవి. విద్యుత్ చార్జీలు పెరుగుదల చాలా పార్టీలను అధికారం నుంచి దూరం చేశాయి. మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి విద్యుత్ చార్జీలు ఒక కారణం. విద్యుత్ చార్జీలు ఎడాపెడా పెంచేశారు. ఎవరు అడగకపోయేసరికి తమకు తిరుగు లేదని భావించారు. కానీ మొన్నటి ఎన్నికల్లో విద్యుత్ చార్జీలు అనేవి ప్రధానంగా పని చేశాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణమైన ఓటమికి కారణం అయ్యాయి. అయితే దాని నుంచి గుణపాఠాలు నేర్చుకున్నట్లు ఉన్నారు సీఎం చంద్రబాబు. అందుకే ఇప్పుడు విద్యుత్ చార్జీల పెంపు జోలికి పోలేదు. పెంచిన విద్యుత్ చార్జీలను సైతం తగ్గించేశారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పట్ల సానుకూలత వ్యక్తం అవుతోంది.

* ఎడాపెడా చార్జీలు..
రకరకాల పేర్లు చెప్పి విద్యుత్ చార్జీలు పెరిగాయి వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో. ట్రూ ఆప్, ఇతరత్రా కారణాల పేరుతో భారీగా విద్యుత్ చార్జీలను పెంచుకుంటూ పోయారు. ఒక సాధారణ కుటుంబానికి మినిమం చార్జిగా 200 రూపాయలు వచ్చేది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 500 రూపాయల వరకు పెంచుకుంటూ పోయారు. జనాల్లో ఇది బాగా వెళ్ళిపోయింది. సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై పెను భారం పడింది. అయితే ప్రజా సంఘాలు ఆందోళన చేయలేదని, విపక్షాలకు అంత సీన్ లేదని భావించారు జగన్మోహన్ రెడ్డి. అందుకే నచ్చినట్టుగా పెంచుకుంటూ పోయారు. దాని ప్రభావం ఎన్నికల్లో కనిపించింది.

* కూటమిలో సైతం..
అయితే కూటమి( alliance ) అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ విద్యుత్ ఛార్జీల పెంపు అనేది కొనసాగింది. ప్రజల్లో చిన్నపాటి అసంతృప్తి కూడా ప్రారంభం అయింది. దానిని గుర్తించిన సీఎం చంద్రబాబు విద్యుత్ చార్జీలను తగ్గించాలని నిర్ణయించారు. గత మూడు నెలలుగా చార్జీలు తగ్గాయి. ఇంకోవైపు వాణిజ్య అవసరాలకు సంబంధించి ఇప్పటివరకు యూనిట్కు 12 రూపాయల వరకు వసూలు చేసేవారు. కానీ ఇకనుంచి తొమ్మిది రూపాయలు మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించారు. దీంతో వాణిజ్య అవసరాలకు సంబంధించిన విద్యుత్ చార్జీలు కూడా తగ్గుతాయి. మొత్తానికి సానుకూలత ఏర్పడనుంది. చంద్రబాబు ముందే మేల్కోవడం కనిపించింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version