Balakrishna : కొన్ని పాటలు ఏళ్ళ తరబడి వినిపిస్తూనే ఉంటాయి. ఏ టీవీ ఛానల్ పెట్టినా, ఏ పబ్ కి వెళ్లినా, ఏ ప్రైవేట్ పార్టీలకు హాజరైనా ఈ పాటలే వినిపిస్తూ ఉంటాయి. అలా ఏడాది కేవలం రెండు నెలల గ్యాప్ లోనే చార్ట్ బస్టర్ సాంగ్స్ వచ్చాయి. ‘గోదారి గట్టు మీద’ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ సినిమా జాతకాన్నే మార్చేసిన పాట అది. ఆ పాట తర్వాత నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరో గా నటించిన ‘డాకు మహారాజ్'(Daaku Maharaj) చిత్రం లోని ‘దబిడి దిబిడి’ పాట పెద్ద హిట్ అయ్యింది. ఈ పాట విడుదలైనప్పుడు సోషల్ మీడియా లో చాలా ట్రోల్ల్స్ వచ్చాయి. ఆ పాటకు కొరియోగ్రఫీ చేసిన శేఖర్ మాస్టర్ ని అడ్డమైన బూతులు తిట్టారు నెటిజెన్స్. కానీ థియేటర్స్ లో ఈ పాటని ఒక రేంజ్ లో ఎంజాయ్ చేసారు ఆడియన్స్.
సరికొత్త ట్యూన్, హుషారు ఎక్కించే జోష్ ఉంటే ఒక పాట ఎంత పెద్ద హిట్ అవుతుందో చెప్పడానికి ఈ పాట ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. నందమూరి బాలకృష్ణ ఈ వయస్సు లో కూడా యువతని ఉర్రూతలూ ఊహించేలా డ్యాన్స్ చేసాడు. సోషల్ మీడియా లో కూడా ఈ పాటపై అత్యధిక రీల్స్ వచ్చాయి. ఇంస్టాగ్రామ్ లో ఇప్పటికీ ఈ పాట ట్రెండింగ్ లోనే ఉంది. యూత్ ఆడియన్స్ విచ్చలవిడిగా కనెక్ట్ అయిపోయారు. తమన్ మ్యాజిక్ ఆ రేంజ్ లో పని చేసింది. అయితే మనుషులు అన్న తర్వాత ఇలాంటి పాటలకు ఎంజాయ్ చేయకుండా ఉండలేరు. కానీ నోరు లేని మూగజీవాలు కూడా ఈ పాటకు వైబ్ అవుతున్నాయంటే నమ్ముతారా. సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారిన ఒక వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దానిని నందమూరి అభిమానులు ఒక రేంజ్ లో షేర్ చేస్తున్నారు.
Also Read : త్వరలో ఓటీటీలోకి రాబోతున్న బాలకృష్ణ లేటెస్ట్ సెన్సేషన్.. దేనిలో స్ట్రీమింగ్ అవుతుందంటే ?
పూర్తి వివరాల్లోకి వెళ్తే దబిడి దిబిడి పాటకు ఒక ఎలుగుబంటి డ్యాన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక జూ పార్క్ కి వెళ్ళినప్పుడు వీక్షకులు ఎలుగుబంటి ని చూసి తమ మొబైల్ లో ‘దబిడి దిబిడి'(Dabidi Dibidi Song) సాంగ్ ని ప్లే చేసారు. దానికి ఎలుగుబంటి ఎంత హుషారుగా తల, కాళ్ళు ఊపుతూ డ్యాన్స్ చేస్తుందో మీరే చూడండి. చూసేందుకు ఎంతో ముచ్చటగా అనిపిస్తున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తోంది. సంగీతానికి రాళ్లు అయిన కరిగిపోవాల్సిందే అని పెద్దలు అంటుంటారు. వాళ్ళు మాట్లాడే మాటలు అతిశయం అని మనం ఒక్కోసారి అనుకోవచ్చు కానీ,ఇలాంటివి చూసినప్పుడే పెద్దోళ్ళు వాళ్ళ అనుభవం తో ఇలాంటి మాటలు చెప్తుంటారని అర్థం అవుతుంది. బాలయ్య తమన్ కాంబినేషన్ లో వచ్చిన ఐదవ చిత్రమిది. ప్రస్తుతం వీళ్లిద్దరు కలిసి ‘అఖండ 2’ కి పని చేస్తున్నారు.
Oreyy #DaakuMaharaaj #DabidiDibidi pic.twitter.com/plksmZqzEl
— Chaitanya (@chaitanya09999) February 25, 2025