Balakrishna : టాలీవుడ్ లో మోస్ట్ పవర్ ఫుల్ కాంబినేషన్స్ లో ఒకటి బాలకృష్ణ(Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్. ఇప్పటి వరకు వీళ్లిద్దరి కలయిక లో సింహా, లెజెండ్, అఖండ(Akhanda Movie) చిత్రాలు వచ్చాయి. మూడు చిత్రాలు కూడా ఒకదానిని మించి ఒకటి సూపర్ హిట్ అవుతూ వచ్చాయి. ముఖ్యంగా అఖండ చిత్రమైతే బాలయ్య జీవితాన్నే మార్చేసింది. సినీ ఇండస్ట్రీ లో ఎన్నడూ చూడని మహర్దశని బాలయ్య ఈ సినిమా తర్వాత చూస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా నాలుగు భారీ బ్లాక్ బస్టర్స్ వరుసగా కొట్టడం 5 దశాబ్దాల బాలయ్య కెరీర్ లో అఖండ నుండే మొదలైంది. అలా బాలయ్య కి బోయపాటి శ్రీను ఎంతో కలిసొచ్చాడు. ప్రస్తుతం వీళ్లిద్దరు కలిసి ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రం చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Also Read : ఆ మూవీ చూసి మహేష్ బాబు మీద కోపాన్ని పెంచుకున్న రాజమౌళి…
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా గురించి సోషల్ మీడియా లో ఒక ఆసక్తికరమైన విషయం ప్రచారం లోకి వచ్చింది. అదేమిటంటే బాలయ్య కి, బోయపాటి శ్రీను కి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చిందని, ఇద్దరి మధ్య ఈమధ్య గొడవలు అవుతున్నాయని. రీసెంట్ గా అయితే బాలయ్య బోయపాటి పై అలిగి షూటింగ్ స్పాట్ నుండి వాకౌట్ అయ్యాడని, ఇలా ఎన్నో రకాల రూమర్స్ ప్రచారం అయ్యాయి. ఈ రూమర్స్ నిజమేనేమో అనుకోని అభిమానులు కంగారు పడ్డారు. ఎందుకంటే ఈ చిత్రాన్ని వాళ్ళు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సినిమాతో బాలయ్య ఈసారి ఏకంగా 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు కొల్లగొడుతాడని బలంగా నమ్ముతున్నారు. అలాంటి ప్రాజెక్ట్ పై ఇలాంటి రూమర్స్ వస్తే భయపడడం సహజమే మరీ. అయితే సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఈ సినిమాకు సంబంధించిన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.
షూటింగ్ కార్యక్రమాలు చాలా సజావుగా జరుగుతుందని, బాలకృష్ణ, బోయపాటి శ్రీను ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేస్తున్నారని, థమన్ అద్భుతమైన ట్యూన్స్, గూస్ బంప్స్ రప్పించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని రెడీ చేశాడని అంటున్నారు. ‘అఖండ’ చిత్రం అంత పెద్ద హిట్ అవ్వడానికి బాలయ్య, బోయపాటి శ్రీను ఎంత కారణమో, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా అంతే కారణం. టైటిల్స్ కార్డు దగ్గర నుండి క్లైమాక్స్ వరకు థమన్ కొట్టిన మ్యూజిక్ కి థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ కి రోమాలు నిక్కపొడుచుకున్నాయి. మొదటి భాగానికే ఆ రేంజ్ మ్యూజిక్ ని ఇస్తే, ఇక రెండవ భాగానికి ఏ రేంజ్ మ్యూజిక్ ని ఇస్తాడో మీరే ఊహించుకోండి. ఈ చిత్రంలో హీరోనే గా సంయుక్త మీనన్ నటిస్తుండగా, విలన్ గా ఆది పినిశెట్టి నటిస్తున్నాడు. సంజయ్ దత్ కూడా ఈ చిత్రంలో ఉన్నాడని రూమర్స్ వినిపించాయి కానీ, దీనికి సంబంధించిన అధికారిక నిర్ధారణ కావాల్సి ఉంది.
Also Read : మార్క్ శంకర్ కోసం సింగపూర్ కి రేణు దేశాయ్..కానీ చివరికి ఏమైందంటే!