Alekhya Chitti Pickles: అలేఖ్య చిట్టి పికిల్స్(Alekhya Chitti Pickles)..యూట్యూబ్ , ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ ఇలా ఎక్కడ చూసినా గత వారం రోజుల నుండి ఈ పేరు ఎలా మారుమోగిపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ముగ్గురు అక్కాచెల్లెళ్లు కలిసి పెట్టుకున్న ఈ పికిల్స్ వ్యాపారం ఒక సంచలనం సృష్టించింది అనే చెప్పాలి. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా, ఇతర దేశాలకు కూడా వీళ్ళు పికిల్స్ ని ఎగుమతి చేస్తుంటారు. అలాంటి బిజినెస్ కేవలం అలేఖ్య నోటి దూల వల్ల పేకమేడలాగా కుప్ప కూలిపోయింది. ఒక కస్టమర్ ఎందుకు ఇంత రేట్స్ ఉన్నాయి అని అడిగినందుకు అలేఖ్య కోపం తో తిట్టిన బూతుల కారణంగానే ఇంత రచ్చ జరిగింది. అలేఖ్య తో పాటు మిగిలిన సోదరీమణులు కూడా బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది, కానీ రీసెంట్ గానే అలేఖ్య ట్రోల్స్ ని తట్టుకోలేక ఆరోగ్యం క్షీణించి ICU లో చేరాల్సిన పరిస్థితి వచ్చింది.
Also Read: బ్రహ్మముడి విలన్ రుద్రాణి అత్త అందాల అరాచకం
ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది, రీసెంట్ గానే ఆమె హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ కూడా అయ్యింది. ఇదంతా పక్కన పెడితే అలేఖ్య చిట్టి సిస్టర్స్ లో ఎవరో ఒకరికి ‘బిగ్ బాస్ 9 తెలుగు'(Bigg Boss 9 Telugu) లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం వచ్చింది అంటూ సోషల్ మీడియా లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై అలేఖ్య సోదరి సుమీ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పందిస్తూ ‘మాకు ఇప్పటి వరకు బిగ్ బాస్ టీం నుండి ఎలాంటి మెయిల్ రాలేదు. మేము బిగ్ బాస్ కి వెళ్తున్నాం అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. గతంలో నేను నా యూట్యూబ్ ఛానల్ లో చేసిన ఒక వీడియో లో బిగ్ బాస్ లోకి వెళ్లే అవకాశం వస్తే కచ్చితంగా వెళ్తాను అని చెప్పాను, బహుశా దానిని చూసి అందరూ ఇలా అనుకుంటున్నారేమో’ అంటూ చెప్పుకొచ్చింది సుమీ.
ఇకపోతే తనకు తన భర్త విడాకులు ఇచ్చి దూరంగా వెళ్లిపోయాడంటూ వస్తున్న వార్తలపై కూడా ఆమె రెస్పాన్స్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘నా భర్తతో నేను విడిపోయాను అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. నాకు పెళ్ళై సరిగ్గా ఏడాది మాత్రమే అయ్యింది. ఇంత కష్టసమయంలో కూడా నా భర్త నాతోనే ఉంటూ ఎంతో సహాయసహకారాలు అందించాడు. మేమిద్దరం బాగానే ఉన్నాము, దయచేసి మా మీద ఇలాంటి ప్రచారాలు ఇక ఆపేయండి. నేను కూడా ఈ వివాదాలపై ఇదే నా చివరి వీడియో అని అనుకుంటున్నాను. ఇక నుండి ఎప్పటి లాగానే వృత్తిపరమైన వీడియోలు చేస్తాను. ఎందుకంటే నాకు ఇది తప్ప మరో వ్యాపారం లేదు. మరో ఆరు నెలల వరకు యూట్యూబ్ తో వచ్చే డబ్బులతోనే మేము బ్రతకాలి’ అంటూ చెప్పుకొచ్చింది సుమీ.
