https://oktelugu.com/

‘టార్చ్ బెర్రర్’గా మారబోతున్న బాలయ్య!

నందమూరి బాలకృష్ణ సినిమాలకు మొదటి నుండి పవర్ ఫుల్ టైటిల్స్ మాత్రమే బాగా వర్కౌట్ అవుతూ వస్తున్నాయి. ఆ మాటకొస్తే బాలయ్యకి యాక్షన్ సెట్ అయినట్లుగా మరే ఎమోషన్ సెట్ అవ్వదు. అందుకే కథల విషయంలో అలాగే డైరెక్టర్ ల విషయంలో కూడా బాలయ్య యాక్షన్ కి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. ప్రస్తుతం ఆయన ‘మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఎప్పటిలాగే వీరి సినిమా ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామాగా సాగనుంది. […]

Written By: , Updated On : August 19, 2020 / 01:02 PM IST
Follow us on


నందమూరి బాలకృష్ణ సినిమాలకు మొదటి నుండి పవర్ ఫుల్ టైటిల్స్ మాత్రమే బాగా వర్కౌట్ అవుతూ వస్తున్నాయి. ఆ మాటకొస్తే బాలయ్యకి యాక్షన్ సెట్ అయినట్లుగా మరే ఎమోషన్ సెట్ అవ్వదు. అందుకే కథల విషయంలో అలాగే డైరెక్టర్ ల విషయంలో కూడా బాలయ్య యాక్షన్ కి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. ప్రస్తుతం ఆయన ‘మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఎప్పటిలాగే వీరి సినిమా ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామాగా సాగనుంది. అసలు వీరి కలయికలో సినిమా అంటేనే అదొక యాక్షన్ డ్రామా అని ఆడియన్స్ కూడా మెంటల్ గా ఫిక్స్ అయ్యారు అంటే.. వీరి కాంబినేషన్ కు ఉన్న మార్క్ ను అర్ధం చేసుకోవచ్చు. మరి ఆ మార్క్ ను అందుకోవాలంటే.. ఆ రేంజ్ మాస్ టైటిల్ నే పెట్టాలి.

Also Read: మెగా ఫ్యాన్స్ కి మెగా ట్రీట్ !

బాలయ్య సినిమాకి కథ రొటీన్ గా ఉన్నా, యాక్షన్ అండ్ టైటిల్ మాత్రం పవర్ ఫల్ గా ఉంటే.. ఆయన సినిమాలు సూపర్ హిట్ అవుతాయి. అందుకే బోయపాటి, బాలయ్య సినిమాకి పవర్ ఫుల్ టైటిల్ పెట్టడానికి తెగ ఆలోచిస్తున్నాడు. టైటిల్ పై ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి. అందులో మెయిన్ గా ‘మోనార్క్‌’ అనే టైటిల్‌ తో పాటు డేంజర్ అనే టైటిల్ కూడా బాగా వినిపించింది. అయితే తాజాగా మరో ఇంట్రస్టింగ్ టైటిల్ వినిపిస్తోంది. ‘టార్చ్ బెర్రర్’ అనే పవర్ ఫుల్ టైటిల్ కూడా ఇప్పుడు బాలయ్య సినిమాకి పెట్టబోతున్నారని బాగా వినిపిస్తోంది. పైగా టార్చ్ బెర్రర్ అనే డైలాగ్ ఎన్టీఆర్ సినిమాలో బాగా పేలిన సంగతి తెలిసిందే.

Also Read: హ్యాకర్ల బారినపడిన యంగ్ బ్యూటీ..!

అయితే బాలయ్య సినిమా కథకు ఈ ‘టార్చ్ బెర్రర్’ అనే టైటిల్ పర్ఫెక్ట్ గా సరిపోతుందని.. అందుకే బోయపాటి కూడా ఈ టైటిల్ పెట్టడానికే బాగా ఆసక్తిగా ఉన్నాడని.. ఆల్ మోస్ట్ ఇక ఇదే టైటిల్ ను బోయపాటి టీం ఫిక్స్ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఇక ఈ టైటిల్‌ ఫ్రీ లుక్ పోస్టర్ ను కూడా త్వరలోనే అధికారికంగా రిలీజ్ చేస్తారట. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కొత్త హీరోయిన్ నటిస్తోంది. మొత్తానికి ఆ మధ్య రిలీజ్ అయిన టీజర్ లో బాలయ్య ఎప్పటిలాగే, పవర్ ఫుల్ డైలాగ్ అండ్ ఫుల్ యాక్షన్ తో అభిమానులను ఫుల్ గా అలరించారు.అందుకే బాలయ్యకు ఈ సారి కూడా బోయపాటి మరో సూపర్ హిట్ ఇస్తాడని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు.