https://oktelugu.com/

బాబుపై కేసు… జగన్ కు మరో అస్త్రమేనా?

రాష్ట్రంలో ముఖ్యమైన వ్యక్తుల ఫోన్ లు ట్యాపింగ్ అవుతున్నాయన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రతిపక్షనేత చంద్రబాబు తన ఫోన్ ట్యాప్ అవుతుందని, దీనిపై విచారణ నిర్వహించాలని ప్రధానికి లేఖ రాశారు. దీంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అటు ప్రభుత్వానికి, ఇటు ప్రతిపక్షానికి మధ్య దుమారం రేపుతుంది. ఈ విషయంలో చంద్రబాబు ఎదుర్కొనేందుకు వైసీపీ నేతల వ్యూహం పెద్దగా ఫలించలేకపోయిన బీజేపీ నేతలు మాత్రం చంద్రబాబును గట్టిదెబ్బ కొట్టగలిగారు. Also Read: ఏపీ రాజధానిపై సుప్రీంలో కీలక పరిణామం.. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 19, 2020 / 12:35 PM IST
    Follow us on


    రాష్ట్రంలో ముఖ్యమైన వ్యక్తుల ఫోన్ లు ట్యాపింగ్ అవుతున్నాయన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రతిపక్షనేత చంద్రబాబు తన ఫోన్ ట్యాప్ అవుతుందని, దీనిపై విచారణ నిర్వహించాలని ప్రధానికి లేఖ రాశారు. దీంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అటు ప్రభుత్వానికి, ఇటు ప్రతిపక్షానికి మధ్య దుమారం రేపుతుంది. ఈ విషయంలో చంద్రబాబు ఎదుర్కొనేందుకు వైసీపీ నేతల వ్యూహం పెద్దగా ఫలించలేకపోయిన బీజేపీ నేతలు మాత్రం చంద్రబాబును గట్టిదెబ్బ కొట్టగలిగారు.

    Also Read: ఏపీ రాజధానిపై సుప్రీంలో కీలక పరిణామం.. వెనుక కథేంటి?

    ఒక వైపు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రధాని మోడీపై కొద్ది రోజుల కిందట తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తడాన్ని తప్పుబట్టి సోషల్ మీడియా వేధికగా ఏకి పారేశారు. మరోవైపు బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు చంద్రబాబు లేఖ రాయడాన్ని తప్పుబట్టారు. కేంద్రం ఇటువంటి విషయాల్లో జోక్యం చేసుకోదని, న్యాయస్థానాలే ఈ విషయాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాయని చెప్పుకోచ్చారు.

    అంతటితో ఆయన ఆగిపోలేదు. చంద్రబాబుపై గతంలో ఉన్న అక్రమాస్తుల కేసు విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో 15 ఏళ్లుగా స్టే విధిస్తూ వస్తుండటం అసాధారణ అంశంగా పేర్కొన్నారు. ఇది గిన్నిస్ బుక్ రికార్డుల్లో నమోదు చేయాల్సిన అంశమేనని చెప్పారు. ఏ న్యాయస్ధానంలోనైనా ఒక కేసులో ఇన్నేళ్లపాటు మధ్యంత ఉత్తర్వులు ఇస్తూ ఉండటం విశేషంగానే చెప్పాలిమరి. ఈ కేసులో సీబీఐ విచారణ కోరుతూ లక్ష్మీపార్వతి కేంద్రానికి లేఖ రాస్తున్నారని, అయితే సిఎం జగన్ కు లేఖ రాస్తే పరిశీలించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని జీవీఎల్ సలహా ఇచ్చారు.

    Also Read: పవన్ కళ్యాణ్ ది ‘రాజకీయ’ దీక్షేనా?

    మరుగున ఉన్న చంద్రబాబు అక్రమాస్తుల కేసు ఇప్పడు వెలుగులోకి రావడం, 15 ఏళ్ల నుంచి స్టే పొందుతూ వస్తుండటం చూస్తే ఈ వ్యవహారం వైసీపీ ప్రభుత్వానికి ఒక అస్త్రంగానే చెప్పవచ్చు. అమరావతి నిర్మాణం, ఫైబర్ గ్రిడ్ పనుల్లో అవినీతిని తవ్వి మాజీ సీఎం చంద్రబాబును, మంత్రి లోకేష్ ను బుక్ చేయాలని చూస్తున్న జగన్ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాడా లేదా అనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే.