Homeఎంటర్టైన్మెంట్Balakrishna: శివ భక్తుడిగా బాలకృష్ణ.. నిజంగా తాండవమే!

Balakrishna: శివ భక్తుడిగా బాలకృష్ణ.. నిజంగా తాండవమే!

Balakrishna: బాలకృష్ణ, బోయపాటి శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోంది. వీరి కాంబినేషన్‌లో కరోనా 2021లో విడుదలై భారీ విజయం సాధించిన అఖండి సినిమాకు సీక్వెల్‌గా అఖండ–2ను తెరకెక్కించబోతున్నారు. అఖండలో శివ భక్తుడిగా బాలయ్య నటించారు. సాధారణంగా బాలయ్య నృసింహస్వామి భక్తుడు. ఆయన చాలా సినిమాల్లో నృసింహుడికి పూజలు చేస్తున్న సన్నివేశాలే ఉంటాయి. అయితే అఖండ సినిమాద్వారా బోయపాటి బాలయ్యను శివ భక్తుడిగా చూపించారు. తాజాగా తెరకెక్కుతున్న మాస్‌ ఎంటర్‌టైనర్‌ అఖండ–2లో కూడా శివ భక్తుడిగా బాలయ్య కనిపించబోతున్నారు. బాలయ్యకు ఈ పాత్రలో ప్రత్యేకమైన దైవ భక్తి, సంప్రదాయాలకు సంబంధించిన అనేక అంశాలు ఇంటాయని ఇండస్ట్రీ వర్గాల టాక్‌. ఇక బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన సింహ, లెజెంట్, అఖండి ఘన విజంయ సాధించాయి. ఇప్పుడు అఖండ2 కూడా అంతకు మించి ఉంటుందని అంటున్నారు. బాలయ్య పాత్ర మరింత బలంగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఇందులో దేవాలయాల పవిత్రతను కాపాడే శివ భక్తుడిగా బాలయ్య కనిపిస్తారని తెలుస్తోంది.

పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌..
ఇక బాలయ్య సినిమా అంటేనే మాస్, పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ ఉంటాయి. అఖండ2లో కూడా అంతే పవర్‌ఫుల్‌ పాత్ర ఉంటుందని తెలుస్తోందిజ అత్యంత భక్తి చూపుతూ ఆచారాలపై గౌరవం కలిగి, వాటిని కాపాడే శక్తివంతమైన పోరాటాన్ని సాగిస్తాడని అంటున్నారు. హిందూ సంప్రదాయాలను రక్షించడానికి ప్రయత్నించే బాలయ్య పాత్రలో బాలయ్యకు పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ కూడా రాయిస్తున్నారని తెలుస్తోంది. టైటిల్‌ రివీల్‌ వేడుకలో ఇప్పటికే బాలయ్య చెప్పిన డైలాగ్‌ వైరల్‌ అవుతోంది. దీంతో అభిమానుల్లో సినిమాపై అంచనాలు పెంచేసింది.

పాన్‌ ఇండియ స్థాయిలో..
ఇక అఖండ 2 ను పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తారని తెలుస్తోంది. భారీ బడ్జెట్‌లో దీనిని నిర్మించబోతున్నారు. బాలకృష్ణ కెరీర్‌లోనే అంత్యంత భారీ బడ్జెట్‌ చిత్రం అని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా బోయపాటి దీనిని రూపుదిద్దబోతున్నారు. అఖండి సినిమా తొలి భాగం సక్సెస్‌ తర్వాత అభిమానుల్లో అఖండ 2పై అంచనాలు పెరిగాయి. ఇక బాలయ్య పా్ర‘త, ఆచారాల రక్షణ, పవిత్రత వంటి అంశాలు పాన్‌ ఇండియా లెవల్‌లో ఉంటాయని తెలుస్తోంది. సమాజానికి సందేశం ఇవ్వడం ద్వారా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించేలా సినిమా ఉంటుందని తెలుస్తోంది.

అఖండి సూపర్‌ హిట్‌..
ఇక అఖండ సినిమాతో బాలయ్య తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆ విజయానికి తగ్గట్టుగానే సీక్వెల్‌ అఖండ 2 తాండవంపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇందులో పవర్‌ఫుల్‌ పాత్రతో బాలకృష్ణ సినిమా మరింత శక్తివంతంగా ఉంటుందని అంటున్నారు. ఇక ఆలయ్యకు సౌత్‌తోపాటు నేషనల్‌ లెవల్లో క్రేజ్‌ ఉంది. దీంతో అఖండ 2ను పాన్‌ ఇండియా లెవల్‌లో తెరకెక్కించబోతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular