
Balakrishna: నటసింహం బాలయ్య ఒక్కసారిగా రేసులోకి వచ్చాడు. అఖండ ముందు వరకు ఆయన కెరీర్ అగమ్య గోచరంగా ఉంది. వరుస పరాజయాలతో మార్కెట్ పూర్తిగా దెబ్బతింది. ఆయన సినిమాలు పదికోట్ల షేర్ సాధించలేక చతికిలపడ్డాయి. ఆ టైం లో దర్శకుడు బోయపాటి శ్రీను ఊపిరిపోశాడు. అఖండ మూవీతో అరుదైన విజయం అందించారు. 2021 డిసెంబర్ లో విడుదలైన అఖండ బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక వీరసింహారెడ్డి మూవీతో ఆ సక్సెస్ ట్రాక్ కొనసాగించారు. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన వీరసింహారెడ్డి మిక్స్డ్ టాక్ తెచ్చుకుని కూడా మంచి వసూళ్లు రాబట్టింది.

బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చి దశాబ్దాలు గడుస్తుంది. ఇన్నేళ్లకు మళ్ళీ వీరసింహారెడ్డి చిత్రంతో ఆ ఫీట్ అందుకున్నాడు. మరోవైపు హోస్ట్ గా బాలయ్య దుమ్ము దులుపుతున్నాడు. అన్ స్టాపబుల్ సీజన్ వన్ అండ్ టు… భారీ ఆదరణ దక్కించుకున్నాయి. మహేష్, పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి స్టార్స్ గెస్ట్స్ గా రావడం జరిగింది. వారిలోని తెలియని కోణాలను బాలయ్య బయటకు తీశారు. బాలయ్య హోస్ట్ గా టాక్ షో అనగానే చాలామంది పెదవి విరిచారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బాలయ్య బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు.
Also Read: Rashmika Mandanna: ట్రోల్ ఆఫ్ ది డే : బట్టల్లేక, సరిపోక.. పాపం రష్మిక పరువు అంతా పాయే!
అల్లు అరవింద్ కి బాలయ్య బంగారు గనిలా దొరికాడు. అన్ స్టాపబుల్ షో ఆహా యాప్ కి విపరీతమైన ఆదరణ తెచ్చిపెట్టింది. చందాదారులు లక్షల్లో పెరిగేలా చేసింది. ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్స్ చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. అలాగే బాలయ్యతో అల్లు అరవింద్ రిలేషన్స్ బాగా బలపడ్డాయి. ఈ క్రమంలో బాలయ్యతో ఆయన ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారట. ఆయన ఇమేజ్ కి తగ్గట్లుగా స్క్రిప్ట్ సిద్ధం చేయిస్తున్నారట. అన్నీ కుదిరితే బాలయ్య డెబ్యూ వెబ్ సిరీస్ ఆహాలో ప్రసారం అవుతుందట. ఈ మేరకు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది.
బాలయ్య వెబ్ సిరీస్ చేస్తే ఇక వ్యూవర్షిప్ బాక్సులు బద్దలు కావడం ఖాయం. ప్రస్తుతం బాలయ్య దర్శకుడు అనిల్ రావిపూడితో మూవీ చేస్తున్నారు. ఇది బాలయ్య 108వ చిత్రం. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఆసక్తికర కథతో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. కాజల్ అగర్వాల్ మొదటిసారి బాలయ్యతో జతకడుతుంది. ఇక యంగ్ బ్యూటీ శ్రీలీల ఓ కీలక రోల్ చేస్తున్నారు. ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నెక్స్ట్ షెడ్యూల్ కి సిద్ధం అవుతుంది. తారకరత్న మరణం కారణంగా తాత్కాలిక విరామం ఏర్పడింది.
Also Read: Manchu Manoj: భూమా మౌనిక కొడుకు విషయంలో మనోజ్ సంచలన నిర్ణయం!