https://oktelugu.com/

Balagam 50 days : ‘బలగం’ చిత్రం ఎన్ని కేంద్రాలలో 50 రోజులు పూర్తి చేసుకుందో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

Balagam 50 days : ఈ ఏడాది అతి చిన్న సినిమా గా ప్రేక్షకుల ముందుకు వచ్చి, బాక్స్ ఆఫీస్ వద్ద అణుబాంబు లాగ పేలిన చిత్రం ‘బలగం’. ఈ చిత్రం ఇంతటి సంచలన విజయం సాదిస్తుందని బహుశా ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా ఊహించి ఉండదు.ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వం లో తెరకెక్కిన మొట్టమొదటి చిత్రం ఇది. చిన్నప్పటి నుండి ఆయన పుట్టి పెరిగిన తెలంగాణ ప్రాంతం లోని గ్రామీణ సంస్కృతి […]

Written By:
  • NARESH
  • , Updated On : April 19, 2023 / 10:32 PM IST
    Follow us on

    Balagam 50 days : ఈ ఏడాది అతి చిన్న సినిమా గా ప్రేక్షకుల ముందుకు వచ్చి, బాక్స్ ఆఫీస్ వద్ద అణుబాంబు లాగ పేలిన చిత్రం ‘బలగం’. ఈ చిత్రం ఇంతటి సంచలన విజయం సాదిస్తుందని బహుశా ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా ఊహించి ఉండదు.ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వం లో తెరకెక్కిన మొట్టమొదటి చిత్రం ఇది.

    చిన్నప్పటి నుండి ఆయన పుట్టి పెరిగిన తెలంగాణ ప్రాంతం లోని గ్రామీణ సంస్కృతి ని వెండితెర మీద అద్భుతంగా ఆవిష్కరించాడు.ఎమోషన్స్ మరియు హ్యూమర్ తో చక్కని స్క్రీన్ ప్లే మరియు మాటలతో ఈ చిత్రాన్ని ఎవ్వరూ ఊహించని రేంజ్ లో తెరకెక్కించి సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ సినిమాకి సుమారుగా 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తే, అందులో 70 శాతానికి పైగా గ్రాస్ తెలంగాణ ప్రాంతం నుండి రావడం విశేషం.

    ఈ సినిమా ఓటీటీ లో విడుదల అయ్యి చాలా కాలం అయ్యింది.అక్కడ కూడా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది, ఓటీటీ లో విడుదల అయ్యినప్పటికీ కూడా ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకోబోతుంది.ఇది నిజంగా ఎవ్వరూ ఊహించినది.తెలంగాణాలో విడుదలైన ప్రతీ కేంద్రం లో కూడా ఈ చిత్రం అర్థ శత దినోత్సవం వైపు పరుగులు తీస్తుండడం విశేషం.

    అక్కడి ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా సుమారుగా 20 డైరెక్ట్ కేంద్రాలలో 50 రోజులు పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.ఓటీటీ రాజ్యం ఏలుతున్న రోజుల్లో కూడా స్టార్ క్యాస్ట్ లేని ఒక సినిమా ఇంత అద్భుతమైన విజయం సాధించింది అంటే, ప్రేక్షకులు ఎంత గొప్పవాళ్ళో అర్థం చేసుకోవచ్చు.కమర్షియల్ గా ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ సాధించిన ఈ సినిమాకి, అవార్డులు కూడా అదే రేంజ్ లో వస్తాయో లేదో చూడాలి.