
‘Balagam’ first day collections : వరుసగా పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా ఉంటున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు, అప్పుడప్పుడు చిన్న సినిమాలను కూడా చేస్తుంటాడు.అలా రీసెంట్ గా ఆయన తీసిన చిన్న సినిమా ‘బలగం’ నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది.జబర్దస్త్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న కమెడియన్ వేణు టిల్లు దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఈ సినిమా పై దిల్ రాజు ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాడు.
ఎందుకంటే తన కూతురు ఈ చిత్రం ద్వారా నిర్మాతగా పరిచయం అవుతోంది కాబట్టి పూర్తిగా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాని ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలోనే ప్రొమోషన్స్ చేసారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి టాలీవుడ్ నుండి కొంతమంది ప్రముఖులను పిలవడంతో పాటు, తెలంగాణ ఐటీ శాఖామంత్రి KTRని కూడా ఆహ్వానించారు.వారం రోజుల ముందు నుండే పలు ప్రాంతాలలో ప్రత్యేక ప్రీమియర్ షోస్ ని ఏర్పాటు చేసి సినిమా విడుదలకు ముందే పాజిటివ్ టాక్ వచ్చేలా చేసాడు.
ఒక చిన్న సినిమాకి ఈ మాత్రం బజ్ వచ్చిందంటే దానికి కారణం దిల్ రాజు మార్కెటింగ్ స్కిల్స్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే దిల్ రాజు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఈ సినిమాకి ఓపెనింగ్ ని తెచ్చిపెట్టలేకపొయ్యాడు. మిగిలిన ప్రాంతాలు ఎలా ఉన్నా, నైజాం ప్రాంతంలో మాత్రం మంచి వసూళ్లు వస్తాయని ఆశించారు. కానీ అక్కడే ఈ చిత్రానికి కనీస స్థాయి వసూళ్లు కూడా రాలేదు. దిల్ రాజు అంచనా ప్రకారం ఈ సినిమాకి కేవలం తెలంగాణ ప్రాంతం నుండే రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వస్తుందని అనుకున్నాడు.
కానీ రోజు మొత్తం గడిచిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చే వసూళ్లు కూడా కోటి రూపాయిలు ఉండేటట్టు లేదు. సినిమాకి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది కానీ, థియేటర్స్ కి వెళ్లి చూసే రేంజ్ సినిమా అయితే కాదని ప్రేక్షకుల అభిప్రాయం.ఇలాంటి సినిమాలను ఓటీటీ లో విడుదల చేస్తే ఆశించిన స్థాయి రీచ్ ఉంటుందని విశ్లేషకుల అభిప్రాయం.