ప్రేక్షకుల కోర్కెని జబర్దస్త్ నిర్వాహకులు నెరవేరుస్తారా : ప్రతి వారం వారం వెరైటీ స్కిట్లతో వచ్చి కడుపుబ్బా నవ్విస్తూ ఉండే జబర్దస్త్ కార్యక్రమం తాజాగా ఒక ప్రోమోని విడుదల చేసింది. ఈ టీవీ లో ప్రసారమవుతున్న ఈ కార్యక్రమానికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. అయితే వచ్చేవారానికి సంబంధించిన ప్రోమో ఈపాటికే యూట్యూబ్ లో విడుదల చేశారు.
ఏదో కారణాల వల్ల రోజా ప్లేస్ లో న్యాయ నిర్ణేతగా ఇంద్రజ వస్తున్నట్లు ప్రోమో చూస్తే తెలిసిపోతుంది. మనో ఇంకొక న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న ఈ షో కి అనసూయ వ్యాఖ్యాతగా గా వ్యవహరిస్తోంది. అయితే యూట్యూబ్ లో విడుదల చేసిన జబర్దస్త్ ప్రోమో కింద ఒకటే రకమైన కామెంట్లు తడువుగా కనిపిస్తున్నాయి.. ఏంటంటే ఇంద్రజని జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ కార్యక్రమాల్లో ఏదో ఒక దానికి న్యాయ నిర్ణేతగా పిలిపించాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
ఇప్పటికే ఇంద్రజ, శ్రీదేవి డ్రామా కంపెనీ లో న్యాయ నిర్ణేతగా ఉండగా సుడిగాలి సుధీర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ కార్యక్రమంలో సుధీర్ – ఇంద్రజ అమ్మా, కొడుకుల సెంటిమెంట్ బాగా వర్కువుట్ అయ్యింది. ఈ అమ్మా, కొడుకుల కాంబినేషన్ శ్రీదేవి డ్రామా లో కంపెనీ లో బాగా వర్క్ అవుట్ అయ్యింది కూడా. వీల్లద్దరి కాకంబినేషన్ మెచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఇంద్రజ ని జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ కార్యక్రమాల్లో ఏదో ఒక దానికి న్యాయ నిర్ణేతగా పిలిపించాలని కోరుకుంటున్నారు. అంతే కాకుండా ఇంద్రజ నవ్వుకి కి బోలెడు అభిమానులు కూడా ఉన్నారు. మరి ప్రేక్షకుల కోర్కెని మల్లెమాల నిర్వాహకులు తీరుస్తారో లేదో చూడాలి.